Sunday, July 5, 2020

శివోహం

ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు...
మరెన్నో రాతలు నీవు పెట్టే ఈ జీవిత పరిక్షలో గెలిపించినా ఓడించినా...
చింతించను తండ్రి కానీ నిన్ను కోరేది ఒక్కటే...
వాటిని తట్టుకునే శక్తిని...
మనో ధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! ఓ లింగమూర్తి వేయేల
నీ ఆలింగనమీయి ఒకపరి
జన్మ జన్మలకదే సరి సరి
మహేశా.....శరణు.
.

శివోహం

గురు బ్రహ్మ గురుర్ విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు , గురువులకు , పెద్దలకు , మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు…….

శివోహం

తండ్రి శివప్పను
నమ్ముకో నేస్తమా

వేసుకున్న 
వలువలు విడిపోతాయి

పెన వేసుకున్న 
విలువలు పెరిగిపోతాయి

శివోహం  శివోహం

Saturday, July 4, 2020

శివోహం

ఔను తండ్రీ 

తొలి అడుగుల 
ఊయల నుంచి 

తుది అడుగుల 
ఊరేగింపు వరకూ 

నా తోడూ నీడా 
నీవే కదా తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

అక్షరాస్యులు వేరు
నిరక్షరాస్యులు వేరు

శివుని యందు
అసలు సిసలైన
భక్తి ప్రపత్తులు ఇవే

శివోహం  శివోహం

శివోహం

శంకరా!!!!నీవు శిల్పివి
నీవు చెక్కిన అందమైన శిల్పాన్ని నేను
నా చేతులారా నిన్ను పూజించుకొనెడి అదృష్టం నాకెప్పుడు లభిస్తుందో 
పరమేశ్వరా!!!!నా కన్నుల నిండుగా 
నీ దివ్యరూపాన్ని చూసే భాగ్యం 
నా కెన్నడు ప్రాప్తిస్తుందో

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...