Wednesday, July 8, 2020

స్వామి శరణం

ఇంద్రీయ నిగ్రహం లేనివాడు 
ఇంద్రజాలం వేసి పట్టుకోగలడా 

అంతఃకరణ శుద్ధి లేనివాడు 
అంతర్జాలంలో వెదికి పట్టుకోగలడా 

నీ దివ్వమంగళ చరణములను..... 

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం నమఃశివాయ

Tuesday, July 7, 2020

శివోహం


నీ వైపు నే వేసే ప్రతి అడుగూ 
నన్ను నాలోకి నడిపించే దారిలో మజిలీ..
నిన్ను చూపే నా ప్రతి కలా
నా ఉనికిని వెలిగించే వెన్నెల..
నువ్వొక్కటీ నేనొక్కటీ కాదు కదా తండ్రి...
నువ్వే నేను నేనే నువ్వు...
మహాదేవా శంభో శరణు...

Monday, July 6, 2020

శ్రీరామ

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి...

 ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది... మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి....

 ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడు ని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం... 

జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

నమోస్తు రామాయ సలక్ష్మణాయ 
తథా పితుర్మే జనకస్య రాజ్ఞా: 

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం !!

అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణస్య మహాబల: 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః 

హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః 
ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 
 
అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
 
శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.   

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

శివోహం

సమస్తమైన ఆత్మలూ తానై అయినవాడు..

సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు..

సమస్తమూ తానై అయినవాడు..

సమస్త జగత్తులను సృష్టించువాడు..

జడలు గల శిరస్సుతో శోభిల్లువాడునూ..

అతిమృదువైన లేడి చర్మమును ధరించువాడునూ..

జడలమధ్యభాగమున గల శిఖలయందు పింఛములను ధరించువాడునూ..

దేహమునందు అన్ని అవయవములతో పూర్ణత్వము కలవాడునూ..

సర్వమైన భావనలకూ తాను మాత్రమే మూలమై వెలుగొందువాడునూ....

అయినటువంటి ఉమామహేశ్వరునకు సహస్ర ప్రణామములు ఆచరించుచున్నాను.

                  శివా సర్వమూ నీ దయ .

శివోహం

నీవైపు అడుగులు వేసే దారిచూపి
ఈ బ్రతుకు కట్టలు తెంచు, లేకపోతే
త్రిశంకు స్వర్గమే నా జీవితం బంధాలు
వదలలేను, నిన్ను విడిచి ఉండలేను
 మహాదేవా శంభో శరణు...

శివోహం

ఏమిటీ 
కన్నీళ్ళకున్న శక్తి 

ఎంతటి బాధనైనా 
ఇట్టే దూరం చేసేస్తాయి 

బహుశా 
నీ కైలాసం నుంచి వస్తాయేమో

శివోహం  శివోహం

శివోహం

విశ్వాన్ని ఆక్రమించిన విశ్వరూపం నీవే
జగతిని శాసించే జగన్నాటక సూత్రధారి నీవే
నీకు సాటి ఎవరు లేరు..
నిన్ను దాటి ఎవరు పోరు...
నీకు నువ్వే సాటి పరమేశ్వరా.......
శివోహం.......శివోహం........

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...