Wednesday, July 8, 2020

శివోహం

పుస్తక పాఠాలు
బ్రతుకు తెరువు కోసం

జీవన పాఠాలు
జీవుని విముక్తి కోసం

శివోహం  శివోహం

శివోహం

ఈ పాదాలే 

నా కష్టాల బరువులను మోస్తున్న 

నా మహాదేవుని మహా భుజాలు 

శివోహం  శివోహం

శివోహం

కనిపిస్తూ 
శిథిలమై పోయే 
శరీరం కన్నా 

కనిపించక పోయినా
శాశ్వతమైన
కైలాసమే మిన్న 

శివోహం  శివోహం

శివోహం

తండ్రి శివప్ప అంటే

మట్టిలో 
కలిపేవాడు కాదు

మహిలో 
నిన్నూ నీ పేరునూ

చిర స్థాయిగా
కలకాలం నిలిపేవాడు

శివోహం  శివోహం

శివోహం

నీకూ
నాకూ 
నడుమ 
దూరము

ఒక 
కన్నీటి తెర మాత్రమేనని
నీకు
నాకు మాత్రమే బాగా తెలుసు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఈ దోసెడు నీళ్ళు 
నీ చెంత చేరాలంటే 

ఎన్ని నా చితా భస్మాలను 
నీ తనువుపై పూసుకోవాలో

నాకు
ఎలా తెలుస్తుంది తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

శివుడు అభిషేక ప్రియుడు...

హాలాహలాన్ని కంఠమందు ధరించాడు...

ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు...

నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది...

అందుచేత నే గంగను తలపై ధరించాడు అభిషేక ప్రియుడయ్యాడు మన భోళా శంకరుడు....

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...