Thursday, July 9, 2020

శివోహం

శంభో...
ఈ క్షణం,ప్రతిక్షణం, మరొక్షణం
ఈ తనువును మృత్యువు తరుముతున్నది...

కానీ చంచలమైన మనసు ఈ సత్యము ఎరుగక ఉన్నది
వక్రమార్గమున పయనించుచున్నది...

పశుప్రాయమవుతున్న మా మదిని నియంత్రించు పశుపతి
నీవు తప్పా మరే జగతిని తలచని శక్తిని ఒసగము సదాశివా....

మరో జన్మలో కాదు ఈ జన్మలోనే మా జీవితాలను నీ పాదముల చేరని....

మహాదేవా శంభో శరణు....

శివోహం

జన్మలో దుఖం
మరణంలో దుఖం
జీవితంలో దుఖం
మరి ఎందుకు ఈ జన్మ జీవుడా 

ఎందరో మహానుభావులు 
పుట్టిరి పెరిగిరి
ఎన్ని ధర్మ ఉపన్యాసాలు
వెదజల్లి నారో ఏరుకో జీవుడా

దుర్మార్గులకు దూరంగా 
సన్మార్గులకు సమీపంగా
ధర్మ మార్గానికి దగ్గరగా ఉండి
యోగమార్గంలో సాగిపో జీవుడా

రారమ్ము శివ సామ్రాజ్యంలోకి
సభ్యులము అయిపోదాం
శివుడితో ఆనందంగా గడుపుదాం
శివుని కృపా కటాక్షము పొందుదాం

ఈ జన్మ తుది జన్మగ సాధన చేసి
ఆత్మ గా ప్రకాశిస్తున్న మనము
పరమాత్మలో లీనం అవుదాం 

ఓం నమః శివాయ....

శివోహం

నేను నీకు సర్వదా కృతజ్ఞుణ్ణి తండ్రి...
నీ సృష్టిని చూసి తరించే దృష్టిని...
నీ లీలలు పాడే తీయని పలుకుని...
నిన్ను చేరే వడి వడి నడకని...
నీలో లీనమవాలనే చైతన్యాన్ని ఇచ్చి నన్ను
సృష్టించినందుకు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీవు ప్రసాదించే 
కన్నీటి చారికలనే 
విభూది రేఖలను 

ఎన్ని రోజులని 
హృదయ ఫలకంపై 
పూసుకోవాలి 

" రాసుకోవాలి తండ్రీ "

శివోహం  శివోహం

శివోహం

నీలో తండ్రిని
తనువెల్లా నింపుకొని

ఎక్కడెక్కడో
తలచి తరచి చూస్తే

ఏమి ఫలము లేదు
ఏ జ్ఞానము అంటుకోదు

శివోహం  శివోహం

శివోహం

సకల శుభము కలిగించు శక్తియుడితడు....

సర్వ పాపము తొలగించు సర్వేశ్వరుడితడు....

సకలశక్తి సంపద లందించి ముక్తి నిచ్చు....

శంకరుడు సకల శుభకరుడు ఈశ్వరుడే....

ఓం శివోహం.... సర్వం శివమయం....

శివోహం

పాహిమాం గిరిజానాథ...

పాహి కైలాసమందిర....

పాహిమాం సర్వలోకేశ....

పాహి మృత్యుభయాపహ...

శివోహం.... సర్వం శివమయం...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...