Sunday, July 12, 2020

శివోహం

శివా! విశ్వమంత ఆకాశం వింత అయినది
చిత్తంలో ఆకాశం చిత్రమైనది
రెంటిలోన నీ తేజం నిత్య సత్యమైనది
మహేశా.....శరణు.

శివోహం

శివా ! తల్లి తండ్రులు బార్య బిడ్డలు
స్నేహితులు బంధువులు అనే పీటముడి నీ !!

ఏనాడు నా మెడ చుట్టూ బిగించితివో గానీ
ఊపిరి అడనంతగ అది బిగుసుకుపోయింది !!

అప్పటి నుండి ఇప్పటి వరకూ
మోహ సముద్రంలో మునిగిపోయి ఉన్నాను !!

నా దుఖాన్ని ఏ విధంగా రూపు మాపుతావో
అని దిన దినము వేచి చూస్తూ ఉన్నాను !!

మహాదేవా శంభో శరణు

శివోహం

ఎందుకు 
తండ్రీ మవునం 

కోపం ఉంటే 
కాసింత కష్టం ఇవ్వు 

కాళ్ళ దగ్గరే
పడి ఉంటాను కదా

శివోహం  శివోహం

శివోహం

పుర హరా 
ఆశల అంతస్థులకు 
ఏ పునాదులూ తవ్వొద్దు

భవ హరా 
కోరికల క్షణికానందాలకు
ఏ భవంతులూ కట్టొద్దు

శివోహం  శివోహం

శివోహం

ఆది-మధ్య-అంతములు లేనిది, శాశ్వతమైంది, అఖండమైంది, అనాదిగా ఉన్నది చీకటే. వెలుగు సృష్టితమైందే. సృష్టితమైంది శాశ్వతం కాదు. పోతన చెప్పినట్లుగా 'లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది' అలోకమైంది పెంజీకటి. పెంజీకటే సర్వవ్యాపితం. అదే శివస్వరూపం. 'లోకంబులు' అంటే సృష్టి, 'లోకేశులు' అంటే స్థితి, లోకస్థులు లయ. ఈ మూడింటికీ ఆధారమైన త్రిభువనుడూ శంకరుడే. ఈ పెంజీకటి కవతల జ్ఞాన రూపంలో వెలిగే ఈశానుడూ శంకరుడే.

Saturday, July 11, 2020

శివోహం

శివా! నా పంతము వీడనయా
నీ పంచను చేరు వరకు
చేరదీయవయ్యా చేరువగా నీకు
మహేశా ..... శరణు.

శివోహం

అనుకున్నది జరిగితే 
అది శివుడు చేసినట్టు 

అనుకున్నది జరగక పోయినా
అదీ శివుడు చేసినట్టే 

ఏది జరిగినా 
అది మన మంచి కోసమే

అదే 
శివుని శిలా శాసనం

ఆ ఆనతే 
శివుని కఠిన శాసనం 

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...