Thursday, July 16, 2020

శివోహం

నీ భస్మం 
నీవు పూసుకోవడానికి ?

నాతో ఇన్ని
ఆటలు అవసరమా తండ్రీ ??

శివోహం  శివోహం

శివోహం

మా కన్నీటి
బాధలను అనుభవిస్తున్న

నీ కరుణాంతరంగం
ఎప్పటికీ విచ్ఛిన్నం కాని 

కోటాను కోట్ల 
అగ్ని పర్వతాల  సమూహం తండ్రీ

శివోహం  శివోహం

Wednesday, July 15, 2020

శివోహం

ఈ జీవితం 
నాదేనని ?
ఈ శరీరం 
నా స్వంతం అని ??

" మురిసి పోయాను "

ఏవీ 
నా సంతకాలు ?
ఏవీ
నా ఆధారాలు ??

"ఇక్కడ  ఏవీ ఉండవు " 

శివోహం  శివోహం

శివోహం

నీవు 
నర్తించే  

రంగ స్థలంపై 
రారాజులు ఎవ్వరూ ఉండలేరు 

అందరూ 
రాలి పోవలసినదే

శివోహం  శివోహం

శివోహం

ప్రాణ 
వాయువు వరకూ ఎందుకు ?
పట్టుమని
ఓ పది నిముషాలు ??

తన తనువుకు కారణమైన ...
తండ్రి శివప్పను తలచుకుంటూ ...

తల్లి భూమాత
తను తిరగడం ఆపేస్తే ?
సమాధానం 
సర్వేశ్వరునికే ఎరుక ??

శివోహం  శివోహం

శివోహం

శివా!చూసెడి గుణమున్న కన్ను చిన్నదికాగా
 చూడలేకపోతున్నా చుట్టివున్న నిన్ను.
చుట్టివున్న నిన్ను చూడ నిలువు కన్ను విచ్చనీయి
మహేశా.....  శరణు.

శివోహం

శివా!ఎదనున్నా  ఎడముగానే ఉన్నావు
కంటి వెలుగై ఉన్నా  కనిపించకున్నావు
శ్వాస నీ స్మరణ ఆశ నీ కరుణ
మహేశా ...... శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...