Friday, July 17, 2020

శివోహం

మూడు కన్నుల వాడు...

ముజ్జగమ్ములను పాలించు మహాదేవుడు...

కాటికాపరి వాడు జగతి కళ్యాణ కారకుడు...

కలిమి లేమిలలోన కాపాడు మా శివుడు...

కలికి కామాక్షి విభుడు కాశీకపురేశ్వరుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, July 16, 2020

శివోహం

శంభో...
నా తప్పటడుగులను సరిచేసి...
నీ ముంగిట కట్రాడుకు నన్ను కట్టేయవా...
బాల్యచేష్టల నేను చేసిన ఇంకా చేస్తున్న...
పాపాల మూట ముడివిప్పి హరించివేయవా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ ధ్యాన లహరి లో
నన్ను మునిగిపోనీ

నీ గాన లహరి లో
నన్ను ఓలలాడనీ

నీ భావ లహరి లో 
నన్ను యీదులాడనీ

నీ నామ లహరి లో
నన్ను మరచిపోనీ

శివా శరణు

శివోహం

కన్నులు మూసి మౌనంగా 
నిన్ను తలంచిన వేళ శక్తొకటి
వెన్నుబాటలో వెలుగులు చిమ్ముతూ
మిన్నుకు చేరినది, దారులన్నీ శుద్ధిచేసి

నీ చలువయే! మౌనమున శివ పంచాక్షరీ మంత్ర జప మహిమ
 ఓం నమః శివాయ

శివోహం

శివా ! నా నుదిట బ్రహ్మ రాతా ? ఏమో ?
శివనామం ఉంది కదా ! శివ గీత !
నీ చిటికెన కొన గోటిన గీటిన గీత కదా !
శివా ! నీ దయ

శివోహం

శివా!వెన్నులో ఏదో వేడి పుట్టింది 
వేడి ఎగబ్రాకి వెలుగులో కలసింది
ఆ వెలుగు నీవని తెలిసింది
మహేశా..... శరణు

శివోహం

నీ భస్మం 
నీవు పూసుకోవడానికి ?

నాతో ఇన్ని
ఆటలు అవసరమా తండ్రీ ??

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...