Saturday, August 1, 2020

శివోహం

శివా!నీ ప్రతిరూప జగతిలో ఒక రూపం గా నేను
ప్రభవిస్తూ నీవు పరిభ్రమణిస్తూ నేను
ఎన్నాళ్ళు ఇలా అభిషేకిస్తూ నా కన్నీళ్ళు.
మహేశా . . . . . శరణు .

శివోహం

కట్టె కొనల కాడ...
కడ చూపులేల రా శివ...
కాలిపోక ముందు...
నా కనులు తెరిపించు...
నిన్ను చూపించు...

మహాదేవా శంభో శరణు

Friday, July 31, 2020

శివోహం

శివా!ఎదలోనేవున్నా  ఎడముగానే ఉన్నావు
కంటి వెలుగు నీవైనా కనిపించకున్నావు
శ్వాసగా నీవు తిరుగుతున్నా ఆశ తీర్చకున్నావు
మహేశా ...... శరణు.

శివోహం

ఏమి లేకుండా వచ్చి
ఏమి తీసుకెళ్ళకుండా వెళ్ళటమే జీవితం...

ఏదో ఉందని భ్రమించి
ఏమి లేదని తెలుసుకోవడమే ప్రేమ...

నిజమైన ప్రేమ భగవంతుడి సన్నిధిలోనే దొరుకుతుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, July 30, 2020

శివోహం

అమ్మ-నాన్నలు...
విశ్వమే వారు.. 
విశ్వమంతటా ఉభయులు
అందరికీ అభయములీయగ
అణువణువున వెలసినారు
ఓం నమఃశివాయ...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

రావాలనే ఉంది....
పుట్టెడు బాధలు వదిలి...
మరిచిపోలేని బంధాన్ని వదిలి....
నీ చెంత చేరాలని ఉంది...
నిన్ను చూడాలని ఉంది ....
నా కంటి వెలుగులా....
నీలో కలసిపోవాలని ఉంది...

మహాదేవా శంభో శరణు...

శివోహం

తండ్రీ శివప్పా
నీ రుద్ర భూమే

చివరి  
విడిది వసతి నాకు 

ఆఖరి 
విరి పానుపు పవళింపు నాకు

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...