Wednesday, August 26, 2020

శివోహం

స్వామి నీవు మహోన్నతుడవు
మీకు ఎన్నెన్నో కార్యాలు ఉన్నప్పటికీ
నన్నో వంక ఆలకిస్తూనే ఉంటావు
మహాదేవా శంభో శరణు

ఓం

సృష్టికి శ్రీకారం 'ఓం'కారరూపంలో ఉద్భవించినది. వేదమంత్రాలు గణాలైతే వాటికి మూలమైన ఓంకారమే గణపతి. సనాతనధర్మంలో సర్వదేవతా శక్తులకు మూలం ఓంకారం. సృష్టారంభంలో, మంత్రంలో, యంత్రంలో, సమస్తదృశ్య ప్రపంచంలో, త్రికాలాదుల్లో, ప్రత్యణువులో ప్రస్ఫుటమయ్యే విశ్వజనీనమైన, విశ్వవ్యాప్తమైన, సర్వ సమగ్రమైన 'ప్రణవ'స్వరూపమే గజాననుడు. 
ఓం గం గణపతియే నమః

ఓం

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

శివోహం

దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు...

దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు...

ఆ పరమాత్ముడే సత్యం ,సనాతనం...

అతని ప్రేమైక సృజనయే సృష్టి...

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై బాసిల్లుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! కాలానికి వేగానికి పట్టుబడని నీ తేజం
చిరుదివ్వెగ  ప్రభవించి నాలోనే వసియించి
అగుపించని నేనుగా నడిపించెను నన్నుగా
మహేశా ..... శరణు.

Tuesday, August 25, 2020

శివోహం

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...