Monday, August 31, 2020

శివోహం

లోక కళ్యాణం కొరకు నీవు గరళాన్నే మింగావు...
నాపాప క్షయానికి ఈమాత్రం బాధలు పడలేనా ఏంటి...
నాబాధలను నీనామ ప్రవాహం అదుపు చేయదా ఏంటి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

లలిత లలిత 
చర్విత చరణాల
నీ పదముల వెంట
నేను నడుస్తూనే ఉంటా 

సంస్కృతి 
వైభవ సౌరభాలను
ప్రతి భక్తుని హృదయంలో
వెదజల్లుతూనే ఉంటా

తర తరాల 
మన జాతి గౌరవ 
విజయ కేతనం 
ఎగుర వేస్తూనే ఉంటా 

నారద తుంబుర
గాన మాధురిని 
కౌముది హృదయంలో 
పలికిస్తూనే ఉంటా 

హర హర మహాదేవ్ 

శివోహం  శివోహం

శివోహం

నీ అనంత భక్త జన కోటిలో....
ఓ నీటి బిందువును నేను....
అనంత విశ్వంలో ఓ రేణువులా.... 
నిను చేరాలని తాపత్రయం నాది....
మహాదేవా శంభో శరణు....

Sunday, August 30, 2020

శివోహం

దేవాధిదేవా...
మహాదేవా...
నిరతము నీ నామము భజించువాడను...
నీ అడుగు జాడలలో నడుచువాడను...
నీ ఆనకై నీ రాకకై నిను కాంచుటకై నీలో లీనమవుటకై   
పరిపరి విధముల ప్రార్ధించుచున్నను...
మహాదేవా శంభో శరణు

శివోహం

శివా! "ఓం"కారమున తెలిసె నీ తొలి శిశువు
"ఓం" కారము వివరించె నీ మలి శిశువు
ఆ "ఓం" కార జ్యోతి  నాకు తెలియనివ్వు
మహేశా.....శరణు.

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు
తెలియక చేసిన పాపాలు ఎన్నో
గాడి తప్పిన మతిని అనుసరించి
మనిషి చేసిన నేరాలు ఎన్నో

అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా 
ఎంత కాలం మోస్తుంది  
దూరాలు దుర్భరాలు 
కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నాము

Saturday, August 29, 2020

అయ్యప్ప

నా దారి నీ దరికే కాదా తండ్రి...
ఈ దాసుడు నీ దివ్యచరణాల సేవకే...
నా అడుగడుగు నీ  కొండకే...
నా మదిహృది నిన్ను తలుచుటకే...
నా అణువణువు నీ ఆరాధనకే...
హరిహర పుత్ర అయ్యప్ప శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...