Wednesday, September 9, 2020

శివోహం

శంభో మహాదేవా
శంభో మహాదేవా
శంభో మహాదేవా
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా శరణు.  

శివోహం

తండ్రీ శివప్పా

నీవు 
మొదలెట్టిన
నీ భిక్షతో  మురిసిపోతున్నాను 

నీ  
ప్రసాదాన్ని 
కళ్ళకద్దుకుని మెరిసిపోతున్నాను 

శివోహం  శివోహం

శివోహం

ఎన్ని 
దశలు తొలగినా 
మరెన్ని 
దిశలు తిరిగినా 

నా
దశ మారేనా 
నీ 
దిశ వైపు మరలేనా తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఏడుపుతో 
తొలి యాత్ర  
ఏడుపులతో  
తుది యాత్ర 

జీవితం అంటే 
ఇంతేనా ?
మరి 
నీ గురించిన ఆలోచనలు ??

" ఎప్పుడు తండ్రీ "  ???

శివోహం  శివోహం

శివోహం

నీ ధర్మం 
నీవు చేస్తూ ఉండు 

ఆ ధర్మమే 
నీ వైపు నడచి వస్తుంది

శివోహం  శివోహం

శివోహం

ఔను

నీవైపు పయనం అవుతున్న
నిశ్శబ్ధ ప్రామాణిక ప్రయాణంలో

నీ అడుగుల ఆశీర్వాదం
అగుపిస్తూనే ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

నీవు
ఏదీ ఏమీ అడగకు

శివునిపై
నమ్మకం ఉంచు చాలు 

అంతా 
ఆ తండ్రి చూసుకుంటాడు

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...