Thursday, September 10, 2020

హరే

నా మనసును స్వాధీనం చేసుకున్నావు

నీ ఆలోచనలతో నా మదినంతా ఆక్రమించావు

కనుపాపల్లో  పవళించి కళ్ళు మూసినా తెరచినా నీవు తప్ప మరేవి కనిపించనీయవు

*ఎలారా కన్నయ్య ఇలా చేస్తే*
        
నీ ప్రేమ మాధుర్యం లో ఆదరం వదనం సుమధురమై తనువంతా తన్మయమై మనసంత నీ నామస్మరణలో సంగమిస్తోంది *క్రిష్ణ*

శివోహం

ప్రతి క్షణం...
అనుక్షణం...
నీ తలపే నా వోలపై ....
ఈ క్షణం...
మరో క్షణం..
నీ మమమతే నా వరమై...
ఆ క్షణం...
నిరీక్షణం...
నీ హృదయం నాదైతే...
ఎదోక్షణం తీక్షణం...
నీ మనసే నేనైతే...
ససీలో  నిషిలా నువ్వే నా ప్రతీ  కళా...
నిరంతరం నీ ధ్యాసే పరంపరం నీ నిచ్వాసే క్రిష్ణ...

శివోహం

నిన్ను
చూడాలన్నా 
నీ వైపు
రావాలన్నా 

ఎక్కడో 
ఒక చోట 
రాసి 
పెట్టి ఉండాలి తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ శివప్పా

నీ అడుగుల వెనుక 
ఎన్నెన్ని ఆలోచనల  అంతరార్థమో ?

ఆ అంతరార్థం వెనుక 
మరెన్ని ప్రార్థనల  పరమార్థమో  ??

శివోహం  శివోహం

శివోహం

చేసే ఆలోచనల్లో..
ఆచరించే కర్మల్లో..
శివ నామ స్మరణ నామస్మరణ ఉన్నపుడు
ఏ విధమైన అశాంతి దరిచేరదు...

ఓం శివోహం..సర్వం శివమయం

Wednesday, September 9, 2020

అయ్యప్ప

సకల సృష్టికరణ.....
సర్వ రోగనివారణా....
భక్తిఙ్ఞాన ప్రేరణ....
భవసాగరతారణా...
హరిహారపుత్ర అయ్యప్ప....
నిదుర లేచిన నా కనులు....
మొదట చూసే దృశ్యం....
నాలో ఉన్న నిన్నే మణికంఠ....

శివోహం..... శివోహం
ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప...

శివోహం

శంభో మహాదేవా
శంభో మహాదేవా
శంభో మహాదేవా
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా శరణు.  

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...