Monday, September 14, 2020

శివోహం

శంభో!!!
నీ చూపుల కోసమే....
నా ఎదురు చూపులు..
మహాదేవా శంభో శరణు....

Sunday, September 13, 2020

శ్రీరామ


ఆటకి, కర్మకి ఒక్కటే తేడా. ఫలం యొక్క ఆకాంక్ష ఉంటే ఆట కూడా ఒక కర్మ అయిపోతుంది. ఆకాంక్ష లేకపోతే కర్మ ఒక ఆట అవుతుంది. కాబట్టి "ఆకాంక్ష" అనేది కర్మకి, ఆటకి మధ్యగల తేడా.

ఎవరు కర్మలో ఆకర్మని, ఆకర్మలో కర్మని చూస్తారో వారు జ్ఞాని. కర్మలో ఆకర్మని చూడడం అంటే కర్మ చేస్తూ, నేను కర్తని కాదు అని అనుకోవడం. ఎప్పుడైతే ఒక సాక్షీభావం ఉంటుందో, అప్పుడే కర్మ చేస్తున్నా నేను కర్తని కాదు అనే భావన కలుగుతుంది. ఇక రెండోది కర్మ చేయకుండానే కర్మ  చేస్తున్నాను అనే భావన కలిగి ఉండడం.

అనవసరమైన విషయాలు బంధాన్ని కలుగచేస్తాయి. ఏ కర్మ మనకి చుట్టుకుంటుందో అక్కడ మన పాత్ర తప్పక వుంటుంది. నీవు చేసే భోజనం నిన్ను బంధించదు, ఆ భోజనం చేయడానికి నీవు చూపే ఉత్సాహం నిన్ను బంధిస్తుంది.

శివోహం

శివా!ఇది నా పిచ్చిగాని 
నా అభిషేకాలు ఏమి ఘనము
నీకు నిత్యం గంగామృత అభిషేకాలే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ దేహ ధ్యాస ఉండదు..
ఏ పనిలో చిత్త ముండదు...
ఇది కావాలని ఉండదు..
నిన్ను తప్ప ఏదీ కోరదు...
ఏమీ చేతు రా శివ ఏమి చేతురా...

మహాదేవా శంభో శరణు...

Saturday, September 12, 2020

శివోహం

శివా
ప్రారంభంలో ఏక, ద్వి,..పంచదళ, అష్టదళ పుష్పం సమర్పించిన, రానురాను సహస్రదళ పద్మం సమర్పించు భాగ్యం కలిగించు సర్వేశ్వరా
(ధ్యాన, ధ్యాసలో మూలాధారం నుండి సహస్రారం వరకు ఆయా ప్రదేశాల్లో ఉండే పుష్పాలు ఆ భగవంతునికే అంకితం..ఆస్థితికి నన్ను చేర్చవా! చంద్రశేఖరా!! నా మనసును అదుపులో ఉంచి ఉమామహేశ్వర)
ఓం నమఃశివాయ

శివోహం

శివా!నీ పూజకు కుసుమాలూ..... లేవు
అది అష్టోత్తర మైనా సహస్రమైనా
నేను అర్పించె కుసుమమొక్కటే సరిపెట్టుకో
మహేశా . . . . . శరణు .

శివోహం

యావత్ విశ్వ భ్రమణంలో ఉద్భవించేది వినిపించేది "ఓం" మంత్రమే...

ఏ రూపంలో ఉన్నా వినిపించేది నీశంఖనాదమే...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...