Thursday, September 17, 2020

శివోహం

నీ ద్వారాలు 
తెరుచు కోవాలంటే ?

నా ద్వారాలు 
మూసుకు పోవాలా తండ్రీ ??

శివోహం  శివోహం

శివోహం

ఏదో 
ఒక రోజు 
ఎద వీడి
వెళ్ళి పోతావని తెలిసినా కూడా 

ఏరి కోరి  
ఎంచుకున్నాను తండ్రీ  నిన్ను
ప్రాణానికి ప్రాణంగా 
ప్రాణ ప్రియ మహాదేవునిగా

శివోహం  శివోహం

శివోహం

నీవు
మేలిమి బంగారమే కావచ్చు కానీ ?
శివుని 
ఆభరణం అవ్వాలంటే ??

అగ్నికి
ఆహుతి కావాల్సిందే ?
సుతి మెత్తని
తండ్రి దెబ్బలు తగలాల్సిందే ??

శివోహం  శివోహం

శివోహం

నేను చూస్తున్నదంతా
శివ దర్పణంలో నుంచే ?

అందుకే ??

ఇంతలా 
మాయ కమ్మేస్తూ ఉంటుంది తండ్రీ ?

శివోహం  శివోహం

శివోహం

నీ 
పవళింపు సేవకు ?
నీ 
ప్రణవ నాదాన్ని ??

పరవశంగా పాడే
నీ తల్లి దండ్రులు ఎవరయా ?
తెలుసు తండ్రీ
ఎవరూ లేనే లేరనీ ??

శివోహం  శివోహం

శివోహం

శివా!శ్రవణానికి అందిన ప్రణవం
నయనానికి అందని కారణం..?
మరి తెలియగ  నీవే శరణం
మహేశా . . . . . శరణు .

శివోహం

నాది అన్నది ఏదీ లేదిక్కడ..
ఎవరో కష్టపడి చేసినవాటితో,
నాకు జన్మ ఇచ్చినవారితో
నాకు ఇచ్చిన వాటితో బ్రతుకుతూ
పరమాత్మ ఇచ్చిన బుద్ధితో 
జీవితాన్ని కొనసాగిస్తున్నాను తప్ప
నేనంటూ చేసింది ఏదీ లేదు.
సమయానికి అంది వస్తున్నాయి
కొన్ని నేను అందుకున్నట్లు కనిపిస్తున్నాయి
నిజానికి నన్ను ఇక్కడికి పంపించిన 
పరమాత్మే అన్ని ఇస్తున్నాడు నాచేత చేయిస్తున్నాడు
నేను చేయలేనివాటిని, 
నాకు అవసరమైన వాటిని అందిస్తున్నాడు.
ఓ శక్తి బుద్దిని ప్రేరేపిస్తుంది. దేహం సహకరిస్తుంది.
బుద్ది దేహం మందగించిన నాడు
సర్వం ఈశ్వరం.
శూన్యంలో లయం.

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...