Thursday, September 17, 2020

శివోహం

అమ్మకే 
కాదు తండ్రీ  

నాకు కూడా
ఇలాంటి ప్రమాణమే చేశావు 

నన్ను కూడా 
విడిచి పెట్టనని 

శివోహం  శివోహం

శివోహం

కృతయుగం నుండి
కలియుగం వరకూ

నీదైన చివరి పాదం వరకూ
ఈ చక్రం నడయాడుతూనే

" నిలబడుతూ ఉంటుంది తండ్రీ "

శివోహం  శివోహం

శివోహం

శివప్పా

నీవు 
అనుమతి ప్రసాదిస్తే

పేదవాని 
పూరి గుడిసె కూడా

నీకు బ్రహ్మాండమైన
గర్భగుడే కదా తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

కొండ 
ఎక్కితే కానీ 
కరుణించవు 

అభిషేకాలు 
చేస్తే కానీ 
ఆదరించవు 

కన్నీళ్ళతో
వేడుకుంటే కానీ 
ఖర్మలు తెంచవు 

నీకు 
కూడా 
ముడుపులు కావాలా  తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

నీవు 
నాలో 
ఉన్నంత వరకే కదా
నేనూ 
నీతో 
మాటాడ గలిగేది 

నీవు 
నాకు 
దూరమైన నాడు 
నేను 
ఎవరితో 
మాటాడాలి తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

ఎలా  ఓర్చుకుంటున్నావు ?
ఆ చితి మంటల వేడి సెగలను ??

మరెలా  భరిస్తున్నావు ?
ఆ కన్నీటి శాపాల  శోకాలను ??

కాస్త ! 
ఇంటి ముఖం పట్టు !!

కైలాసం చేరుకో తండ్రీ !
నీకూ ఒక కుటుంబం ఉందిగా !!

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా

నీ దర్శన 
భాగ్యమే
రేపటి 
ఉషోదయానికి
శివోదయం

తొలి 
సంధ్యా
కీర్తనల
సమాహారానికి
శుభోదయం

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...