Saturday, October 3, 2020

శివోహం

శివా! చిత్తంలో చిరు జ్యోతివి
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివి
అంతటా ఆవరించి అగుపించకున్నావు
మహేశా ..... శరణు.

Thursday, October 1, 2020

శివోహం

నా హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప జేసుకోవడానికి...

శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి....

వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించా...

ఇక నీ దయ...

మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా! నా నోట, నా నుదుట నీ నామమే
నా శ్వాస,స్మరణములందు నీ మంత్రమే
చితి చిత్తములందు నీ తేజమే
మహేశా ..... శరణు.

Wednesday, September 30, 2020

శివోహం

శివా!నీనుండి విడివడి నేను
విశ్వమంతా తిరుగుతున్నా
నీ ఒడిని చేరగ వెతుకుతున్నా
మహేశా . . . . . శరణు .

Tuesday, September 29, 2020

శివోహం

పూవు పుట్టగానే పరిమళించునట్లుగా...
పసిప్రాయమున పరమశివుని ఆరాధన...
దేవుని నీడను చేరిన వానికి శివుడే గొడుగు పట్టి నడిపించును...

నిను జడిపించేవారికి రుద్రుడే శివుడు మదిలో మల్లికార్జునుడు ఉన్న నీకు కనులతోనే కైలాసము చూడగల భాగ్యం పొందెదవు మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

సత్యం
ధర్మం
శాంతి
ప్రేమ
ఈ నాలుగు మూలస్తంభాల్లా కలిగినదే సనాతన ధర్మం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నిరంతరం నీ నామ స్మరణమనెడి...

పరమానంద ప్రవాహములో విహరించుటయందు...

ఆసక్తి కలిగిన నా హృదయము..... 

ఏమి కొరగలను నీ ఒక్క కృపా వీక్షణమే తప్ప....

మహాదేవా శంభో శరణు....

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...