Sunday, November 1, 2020

శివోహం

శంభో విశ్వమంతా నీ భక్తజనమే... 
వాళ్ల యదలన్ని నీ నివాసమే కదా... 
అయినా నీకు సొంతఇల్లు లేదంటారు ఎంతటి హాస్యమో కదా తండ్రి...
నా మదిలో సదా కొలువుండు తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!అర్ధమవనీ అర్ధనారీశ్వరం
అనుభవానికి రానీ సర్వేశ్వరం
వినవయ్యా నా స్వరం
మహేశా ..... శరణు .

శివోహం

శివా!అదుపు చేయలేక ఆలోచనలను
మలుపు తిప్పమంటున్నా...అందుకే
నీ నామం మననం చేస్తున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

చిత్రమట నువ్వు బహు విచిత్రమట ...
ఏ రూపు లేదట అన్ని రూపాలు నువ్వట......
కనుపించవా పరమేశ్వరా...
ఒకసారి కనుపించి కనువిందు సేయవా....

మహేశా శరణు....

Saturday, October 31, 2020

శివోహం

ఇహమూ దేహము మరవాలీ.....
మదిలో అయ్యప్పను నిలుపాలి....
గానము నీ ధ్యానము కావాలీ....
కార్తీకం లో అయ్యప్పను కొలవాలి....
ముక్తినే కోరుతూ భక్తిలో మునుగుతూ....
భక్తి ముక్తి కలయికలో అయ్యప్పను తలుచుకొని...
నీవే అయ్యప్పవని తెలుసుకోవాలి.....

#ఓం_శ్రీ_స్వామియే_శరణం_అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నిశ్శబ్దం నుండి శబ్దంగా నీవు
శబ్దం నుండి నిశ్శబ్ధానికి నేను
మన కలయిక ఎప్పుడో ఎక్కడో
మహేశా . . . . . శరణు .

శివోహం

సర్వ సృష్టి స్థితిలయ కారకా...
అండపిండ బ్రహ్మాండనాయక...
తండ్రి వాడవు నీవని...
నీ అండ చేరితి తండ్రి...
నీ కరుణ లేని ఈ జన్మ ఎందుకు...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...