Friday, November 6, 2020

శివోహం

ఈ సృష్టంతా సర్వేశ్వరుని స్వప్నసదృశ్యం...
సర్వాంతర్యామి స్వప్నమిది....
మనమంతా ఆ జగన్నాటకంలో పాత్రలం...
ఆట ఆడేది ఆడించేది అంత ఆయనే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఈశ్వరుని లీలావతారము గలవాడవు.  
గొప్ప తేజస్సుగలవాడవు...
మోక్షమను ఫలం నిచ్చుటకు కల్పవృక్షంవంటివాడవు...
నీ నామాన్ని జపించేవారికి...
నిను సదా స్మరించేవారికి...
నీ రూపాన్ని అర్చించేవారికి...
నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు తండ్రి...

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

భవ జలధిని  
దాట లేకున్నాను 

శూలమే తోడుగా 
దరి చేర్చే తెడ్డుగా 

నీ ఒడి లోకి చేర్చుకో తండ్రీ 

శివోహం  శివోహం

Thursday, November 5, 2020

శివోహం

అమ్మ-నాన్నలు...
విశ్వమే వారు...
విశ్వమంతటా ఉభయులు...
అందరికీ అభయములీయగ...
అణువణువున వెలసినారు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కోరికల ఖజానాలు  ఖాళీ కావు 
బంధాల జాతరలు  ఆగి పోవు 

కన్నీటి సముద్రాలు  ఎండి పోవు 
మాయా తెరలు తొలగి పోవు 

మరి 
నిన్ను ఎలా చేరేది తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

శంభో
జీవిత పరీక్ష నీవే... 
ఫలితము నీవే... 
జీవన సార్ధకం నీవే... 
ఆదరించి అనుగ్రహించే దేవదేవుడవు నువ్వే...

మహాదేవా శంభో శరణు...

Wednesday, November 4, 2020

శివోహం

శివా!విశ్వమంత వెలుగులో చూడలేను
చీకటిలో నిన్ను చూడ చూపు తిప్పలేను
చింత మాన్పవయ్యా సంతసించ నేను
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...