Thursday, March 18, 2021

శివోహం

పంచాక్షరీ మంత్రాధి దేవుడవు
కొండంత నీవున్నా...
పంచ భూతాల చిరు అంశలలో
దేనితోనైనా నిన్ను పూజించగానే
పులకరించిపోయి మాకు అభయమునిచ్చే దయామూర్తివి దక్షిణామూర్తీ నువ్వే తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆధ్యాత్మిక అనుభవం...

నీ జీవిత పరమావధి  ఏమిటో తెలుసుకో
ఈ జీవితం, సృష్టి ,వీటిలో  ఉన్న నిగూఢ రహస్యాలను తెలుసుకో.
స్వేఛానుభూతి ని పొందు, నీ అంతరంగ లోతుల్ని వెతుకు. వికాస మార్గం లో అతి సున్నితమైన మార్గదర్శక అడుగులు వేస్తూ మున్డుకెళ్ళు.
ప్రగాఢ సత్యాన్ని, అత్యుత్తమమైన జ్ఞానాన్ని, అసాధారణమైన ఆనందాన్ని గురువుయొక్క సమక్షం లో ఆస్వాదించు.
ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం  ఏమిటి అంటే అందరి అనుభవాలు నిర్దిష్ట మైనవే అయినా వర్ణనకు అతీతం .అంటే మాటలలో చెప్పలేము.
అంచెలంచెలు గా అపూర్వ పయనము
నీ శరీరాన్ని, మనస్సుని  ,నీ ప్రాణాన్ని కుదుట పరిచి సంయమనము లో ఉంచాలి.
దీనిలో మొట్టమొదట అడుగు సుదర్శన క్రియ నేర్చుకోవడం క్రియలోని శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ,మన శరీరాన్ని ,మనస్సుని ,ప్రాణాన్ని శుద్ధపరచడమే కాకుండా వాటి మధ్య సంయమనాన్ని తీసుకొస్తుంది.

దీని వల్ల పేరుకుపోయిన వత్తిడిని సహజబద్ధంగాను ,నిర్దిష్టంగాను తొలగిస్తుంది

నీ అంతరాత్మలో ని అనంత సహజ స్వరూపంలో నిమగ్నం అయిపో.
మౌనవ్రతం:- అంటే సహజసిద్ధంగా మనో సంయమనంతో మన శక్తిని ,ధ్యాసని బాహ్య ప్రతిబంధకాల  నుంచి మళ్ళించుకోవడం.
ఈ ప్రక్రియను అనాది గా వివిధ సాంప్రదాయాలలో ,శారీరక ,మానసిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి వాడుతూనే ఉన్నారు.
AOL programs లో పాల్గొనడం వల్ల వాటిలోని నిర్ణీతమైన, ప్రభావపూరితమైన పద్ధతులు మన ప్రాపంచిక ఆలోచనయంత్రాంగ(mind) పరిధులు దాటి అలౌకికమైన  ప్రశాంతత ,ఉత్తేజితమైన ప్రాణ శక్తి  (vitality) మనకు సమకూరుతాయి. మన నిత్య జీవితంలో మనకు బాగా తోడ్పడుతాయి కూడా.

అంతరాంతర ఆత్మశోధన/సుధీర్ఘ అంతర్మథనం
దీనికి ఒక అనుభవజ్ఞడైన గురువు దగ్గర మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది.
సహజ సమాధి ధ్యానము:-ఈ ప్రక్రియలో ఇవ్వబడిన ఓ సాధారణ మైన శబ్దాన్ని ఆసరాగా తీసుకొని మనస్సుని స్థిర పరుచుకుంటారు, అంతర్ముఖులు అవుతారు. దీనితో  మన మనస్సు ,నాడీ వ్యవస్థ గాఢ నిస్సబ్ది లో చిన్న చిన్నగా విలీనం అయి ,మన పురోగతికి ఉన్నఅడ్డంకులు ఒక్కటోక్కటి గా తొలగిపోతాయి.ఈ సుదర్శన క్రియ యొక్క  నిరంతర అభ్యాసం వల్ల మన నిత్య జీవినవిధానం గణనీయంగా మెరుగు పడి,విశాల దృక్పదం, ప్రశాంతత ,ప్రాణ శక్తులను సంతరించుకుంటాయి.

ఆర్తులకు స్వాంతన ఇచ్చే ఆశీర్వాద ప్రక్రియ
సమృద్ధి,సంతుష్టి, ఆశయ సాకారతలను అందించే ఆశీర్వాద ప్రక్రియ మనకు నిత్య నూతన ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం.
ఆశయ సాకారత(fulfillment) తో మన చైతన్యానికి ఒక అవ్యానుభుతి, దివ్యానుభూతి. దీనిని నేర్చిన వారు చికిత్స రూపంగా జనాళి కి బహు ఉపయుక్తముగా ఉండగలరు.ఆ విధంగా ఇరులకు(both the healer and the healed) సంతోషాతిశయాలు ,సంతృప్తి కలుగుతాయి. పరులకు సేవ చేయడానికి ఇది ఒక మహాదావకాసం ,ప్రస్తుత సమాజములో చాల అవసరము కూడా.
ఎంతోమందికి  ఈ చికిత్స(healing by blessing) వల్ల అలౌకిక స్వాంతన లభించిన నిదర్శనాలు ఉన్నాయి. ఇది సేవా తృష్ణాతులకు గొప్ప అవకాశం.

Source: సేకరణ

కృతజ్ఞత లో తరింపు:-
నిబద్ధత తో అర్పించిన  నిర్మల పరిపూర్ణ హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు పరిపక్వ చైతన్యానికి నిదర్శనం .దీనికుద్దేసించిన మహత్తర ప్రక్రియ “గురుపూజ”.మన పవిత్ర సనాతన సాంప్రదాయంలో ఇదొక ప్రత్యేకత సంతరించుకున్న గొప్ప  కార్యక్రమం. అనాది గా వస్తున్నా జ్ఞాన జ్యోతి ని అందిస్తూ వస్తున్న గురుపరంపరకు ఈ గురుపూజ, చంద్రుడికొ నూలుపోగు లాంటిది.నీటిబిందువు చిన్నదైనా సముద్రములో కలిసినప్పుడది  సముద్రపు స్థాయిని అనుభవించినట్లే మనం కూడా ఈ సనాతన గురువుల సాంప్రదాయానికి అనుసంధానమయితే అనంత శక్తివంతులుగా అనుభూతిచెందుతాంకదా!

శివోహం

నువ్వే ప్రాణం శివ...
నా ప్రేమ,ఆనందం,ఆవేదన నువ్వే...
గమనం నువ్వే...
గమ్యం నువ్వే
అది నువ్వే...
అంతం నువ్వే
స్వర్గం నువ్వే...
నరకం నువ్వే
జననం నువ్వే...
మరణం నువ్వే
నా ఆణువణువూ నువ్వే నా సర్వం , సర్వసం నీవే హర...
గుండెకి మానని గాయం చేసే ఆయుధం నువ్వే...
తీరని కోర్కెలు కలిగించే అద్బుతం నువ్వే...
మహాదేవా శంభో శరణు...

ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక చింతన...
మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజం. అలా అని ఎల్లవేళలా అసంతృప్తిగా జీవించలేం కదా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భగవధ్యానం వలన అశాంతి దూరమవుతుంది. ప్రశాంతత వరిస్తుంది. తద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. మనోవ్యాధులు దరిచేరవు.

జీవితంలోని కొన్ని పరిస్థితుల వలన చికాకులు కలగడం సహజం. చీకాకులు కలిగినప్పుడు సరైన నిర్ణయాలను తీసుకోలేం కదా. భగవధ్యానం చేసే వారిలో ఈ సమస్య కనిపించదు. వారికి ఆలోచనలలో స్పష్టత ఏర్పడుతుంది. మానసిక చికాకులు తగ్గుతాయి.

నిరాశ, నిస్పృహ వంటివి దరిచేరవు. ఆధ్యాత్మిక చింతన అనేది శ్రీరామరక్షగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం అలవడుతుంది. దాంతో, చేసే పనిపై శ్రద్ధ మరింత పెరుగుతుంది.

ఆధ్యాత్మిక చింతన కలిగే మరొక ముఖ్యమైన ప్రయోజనమిది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యమైన మనసు అనారోగ్యం పాలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా, మానసిక అశాంతితో, చికాకులతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కవుగా. ఆధ్యాత్మిక చింతనని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకునే వారిలో అనారోగ్య సమస్యల బారిన ప్రమాదాలు తక్కువని తెలుస్తోంది. ఎందుకంటే, వారు మానసికంగా దృఢంగా ఉంటారు. కృంగుబాటుకు గురవడం తక్కువ.

దైవచింతనను ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నవారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైవం తమ వెంట ఉందన్న నమ్మకంతో తాము అంకితభావంతో తమ పనిని తాము పూర్తిచేస్తారు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏది జరిగినా మన మంచికే అన్న ఆలోచనా ధోరణితో ముందుకు వెళతారు. గెలుపోటములు వారి గమ్యానికి ఆటంకాన్ని ఏర్పరచలేవు. స్థితప్రజ్ఞతకు అలవరచుకుంటారు. గెలుపును అలాగే ఓటమిని సమానంగా స్వీకరించడం నేర్చుకుంటారు.

ఆధ్యాత్మిక చింతన వలన ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో, పనిపై అపారమైన శ్రద్ధను కనబరచగలుగుతారు. దాంతో, మంచి ఫలితాలు లభించే ఆస్కారం ఉంది. విశ్లేషణా పరిజ్ఞానం పెరుగుతుంది. దాంతో, పరిస్థితులను అలాగే మనుషులను చక్కగా విశ్లేషించగలుగుతారు. తగిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలనైనా అవలీలగా పరిష్కరించగలిగే నేర్పు సొంతమవుతుంది.

ఆధ్యాత్మిక చింతన వలన కలిగే అనేక లాభాలలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి, పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు కలిగిన ప్రాముఖ్యాన్ని వివరించాలి. తద్వారా, వారు వినయ విధేయతలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. తమ తమ రంగాలలో రాణిస్తారు. సమాజానికి తమవంతు సేవను చేయగలుగుతారు. ఈ మధ్య కాలంలో యువత ఆధ్యాత్మికత దిశగా ఆలోచనలు చేయడం అభినందించదగిన మార్పే.

Wednesday, March 17, 2021

శివోహం

శివ అంటే శూన్యం ఆది అంతం లేని వాడు అని అర్థం 
ఈ సృష్టి శూన్యం నుండి జన్మించినవాడు
పంచ భూతాలకి అధిపతి 
చావు పుట్టుకలను నిర్ణయించేది 
స్మశానం లో నిదురించేవాడు
పులి తోలు చుట్టుకునేవాడు 
లోకాధిపతి లయకారుడు రుద్రుడు మహా శివుడు 
ఓం నమః శివాయ

శివోహం

క్షణక్షణం ఎగిరెగిరి పడుతూ మారుతూ ఉంటుంది నా మనసు...

సకల మాయాలు మొసాలు చేసేది ఇదే మాయదారి మనసు...

దీని రాకడపోకడ ఏరిగేది నీవే మహాదేవా...

నా పాపాపుణ్యాలకు నీదే పూచి...

మహాదేవా శంభో శరణు...

Tuesday, March 16, 2021

శివోహం

శివుణ్ణి కొలువులో అనుగ్రహానికి ఆలస్యం ఉంటుందేమో...

కానీ అతని కరుణకు కొరత ఉండదు....

నన్ను పుట్టించి, ఇన్ని ఇచ్చిన వాడికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు....

అందుకే శివుణ్ణి ఇది కావాలి , అది వద్దు అని కోరుకోకూడదు...

ఓం శివోహం... సర్వం శివమయం
మహాదేవా శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...