Monday, May 10, 2021

శివోహం

శంభో!!! నీ రూపం
నీ నామ స్మరణ లో ఏదో అద్భుతం దాగివుందయ్యా....
ఎంత బాధ వచ్చిన, కష్టం వచ్చిన మనసారా శంభో మహాదేవా అని నిను పిలిస్తే చాలు...
కరుణించి వెనువెంటనే కాపాడతావు...
ఎటువంటి సమస్యకైనా, నీ నామ స్మరణేనయ్యా నాకు దివ్య మంగళ ఔషదం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

గర్వము.
ప్రతి మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి
సామాన్యంగా ఐశ్వర్యమో, పాండిత్యంతో, అధికారమో గర్వానికి కారణాలవుతాయి
కానీ ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించాలి. 
ఎందు కంటే దాని మూలంగ అతనికి మున్ముందు అనర్ధం జరుగుతుంది.
అంతకంటే ఎక్కువగా గర్విష్ఠియైన మనిషి తప్పుడు పనులు చేస్తాడు. 
తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో వుంటాడు. 
తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండ అనుభవిస్తాడు. 
వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడనాడాలి,
శ్రీ శంకర భగవత్పాదుల వారి మాటలలో,
మాకురు ధనజన యౌవన గర్వమ్
హారతి నిమేషాత్ కాలః సర్వం
దనం, యవ్వనం, పాండిత్యం, అధికారమో ఉన్నవి అన్న కారణంగా ఏ మానవుడూ గర్వించరాదు.
ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది, అంటే అవి శాశ్వతం కాదు.
శ్రీ శంకర భగవత్పాదులవంటి మహనీయులు ఎంతటి పండితులైనా ఏమాత్రం గర్వానికి లోనుకాలేదు, అందువలనే ప్రజలు వారిని మహా పురుషులుగా కీర్తించారు. 
కాబట్టి మనిషి ఏకారణంలో కూడా గర్వానికి లోను కాకూడదు, వినయంతో జీవించాలి.
తస్మాదహంకార మిమం స్వశత్రుమ్ భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతమ
భుంక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యధేష్టమ్,
అన్న, భగవత్పాదుల సూక్తిని ప్రతియొక్కరూ మననం చేస్తూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి.
భక్తుడు అనే వాడు ఎప్పుడూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి
🙏🙏

శివోహం

భౌతిక మౌనం తేలికగా ఉన్న
నా మనసు అదుపులో లేక పరిపరి
విధముల అదుపు తప్పుతోంది పరమేశ్వరా...
నీ శరణు కోరి ని సన్నిధికి వచ్చా...

మహాదేవా శంభో శరణు...

Sunday, May 9, 2021

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా ఆటలన్నీ బతుకు పోరాటం కోసం.... 
నీ ఆటలన్నీ నా భవబంధముల విడుదల కోసం..... 

మహాదేవా శంభో శరణు

అమ్మ

దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం. సృష్టిలోని ప్రతీ జీవికి అమ్మ ఉంది...

అమ్మ అంటే అమ్మ నే
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

Saturday, May 8, 2021

శివోహం

ఏ మాట చివరిదో...
ఏ చూపు చివరిదో...
ఏ శ్వాస చివరిదో...
నీకు తప్ప ఎవరికి ఎరుక పరమేశ్వరా.. 

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...