Thursday, May 20, 2021

శివోహం

కోరకనే ఇచ్చు దొరవు నీవు అని తేలిన
ఏ కోరిక కోరడం లేదు శివ...
పేదవాడైన నేను ఆశను దరిదాపు లోనికి రానీయక
కష్టాలు కన్నిరుని దిగమ్రింగి నిన్ను శరణు వేడుతుంది కోరిక తీర్చమని కాదు...
నీ సన్నిధికి చేర్చమని...

మహాదేవా శంభో శరణు...

Wednesday, May 19, 2021

శివోహం

ఎవరు మిత్రులు...
ఎవరు ఆప్తులు...
సదా మనతోకలసి మెలసి మెలుగు వారెవరు...
ఎన్నడూ విడిపోని వాడు..
సదా మనతో ఉండువాడు ఈశుడే వాడు...
కాపాడువాడు నిత్యు డతడే మిత్రు డతడే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

త్రిమూర్తులను సృష్టించిన త్రిపురసుందరివి...
ముగ్గురమ్మల మూలపుటమ్మవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

విశ్వమంతా వ్యాపించి ఉన్నావు...
నీవు తప్ప నాకెవ్వరూ కానరావడం లేదు...
అందరూ నీ అధీనంలో ఉండగా....
మరో దైవం మాట నాకెందుకు శంకరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

విశ్వమంతా వ్యాపించి ఉన్నావు...
నీవు తప్ప నాకెవ్వరూ కానరావడం లేదు...
అందరూ నీ అధీనంలో ఉండగా....
మరో దైవం మాట నాకెందుకు శంకరా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, May 18, 2021

స్వామి శరణం

అయ్యప్ప నామస్మరణం
సకల పాపహరణం...
అయ్యప్ప దర్శనం...
జన్మజన్మల పుణ్యఫలం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...