Saturday, May 22, 2021

శివోహం

తల్లి ప్రత్యక్ష దైవం...
తల్లి సృష్టికి మూలం...
తల్లి శాంతికి వరం...
తల్లి రుణాన్ని తీర్చలేము..

ఓం శ్రీమాత్రే నమః

Friday, May 21, 2021

శివోహం

శంభో...
మర్కట బుద్ది కలిగిన నా మనసు...
కోర్కల వలయంలో  చిక్కి...
కర్కశ హృదయంగా  మారి...
కొరరానివి కోరుతూ ఉన్నది...
కనికరం తో కోర్కెలతో పాటు నన్ను కూడా కడతేర్చి కరుణించి నీ ముందు దీపం లా వేలిగిలా అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నమో వేంకటేశా...
నమో శ్రీనివాసా...
నమో తిరుమలేశా...
నమో చిద్విలాసా...
నమో ఆదిపురుషా...
నమో కలియుగేశా...
నమో విశ్వరూపా...
నమో లక్ష్మీనాథ...
ఆపద మొక్కులవాడా...
అనాథరక్షకా...
గోవిందా గోవిందా

ఓం నమో వెంకటేశయా...

శివోహం

కల్లాకపటం ఎరుగనివాడు....
కనికరముగా మముగాచేవాడు.....
నంది నెక్కి నడయాడేవాడు...
నాగాహారముల నొప్పెడివాడు....

ఓం శివోహం..... సర్వం శివమయం......

శివోహం

శివ నామం చేయండి...
ఆస్వాదించండి...
ఆస్వాదించి ఆనందించండి...
ఆనందించి తరించండి...

ఓం నమః శివాయ...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం....
బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు...
ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం....
అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం.... వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, May 20, 2021

శివోహం

మనసు అంటేనే ప్రాణం...
ప్రాణం లేని శవానికి మనసు ఉండదు. 
ప్రాణం పోవడం అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ  మనసు ,తాను ఆశ్రయించి ఉన్న  జీవుడిని ,దేహి శరీరంలో నుండి  వాయువు రూపంలో  బయటకు  తీసుకెళ్లడంఇదే మరణం...
మనసు ,ప్రాణం జీవుడు ఇవన్నీ ఒకటే...
స్వరూపాలు వేరు పని చేసే తీరు వేరు అంతే...
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...