Thursday, May 27, 2021

శివోహం

శంభో...
నేను నిన్ను నా గుండెల్లో నింపుకొన్నప్పుడు
కైలాసంలో కట్రాడు దగ్గర కాస్తంత
చోటీయలేవా...
బంధాలు బాంధవ్యాలు తరిమేస్తున్నాయి అలసిపోతున్నాను.
నన్ను ఆదుకోవాగా రాలేవా...
మంద బుద్ధి కలిగిన ఈ పశువును నీ సన్నిధిలో కట్టిపడేయవా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అందరిలోనూ నీవే వున్నావు కదా శివ...
నాలోనూ ఉంటావని నాలో నీ కొరకు వెదుకుతున్నా...
నే చూసే రూపాలలో నీకోసం చూస్తున్నా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, May 26, 2021

ఓం

విఘ్న నాయకా ప్రధమ పూజలందుకో...
సమస్త ప్రజలను ఆదుకో...
సమస్త విజ్ఞానము పంచి ఏలుకో...

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

నన్ను మేలుకొలిపేదే నీవు నీకు మేలుకొలుపేల తండ్రి...
నేను ఉదయించే వేళ నారాయణ యని
నిదురించే వేళ నమః శివాయ యని
పలకరించి, పలవరించిన పుణ్యము చేతనే
రాత్రంతా నాకొరకు మేలుకొని, కొత్త ఊపిరి పోసి
ఉదయాన్నే అందరితో నన్ను నిదుర లేపుచున్నావు....
నీ మేలు ఎలా మరవగలను తండ్రి...

మహాదేవా శంభో శరణు..

Tuesday, May 25, 2021

శివోహం

అద్దంలోని బింబాన్ని చూసి తృప్తిగా ఉన్నా...
అంతరాత్మలో నీవే నని బ్రమతో ఉన్నా...
శరణాగత వత్సలుడనై వేచి యున్నా...
ఆత్మార్పణ చేయుటకు వెనుకాడకున్నా...

మహాదేవా శంభో శరణు

శివోహం

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

Monday, May 24, 2021

మోహన్ నాయక్ వాంకుడోత్

శరీరం కదిలించే రథము...
రథానికి ఆత్మయే రధికుడు...
రధికునకు సారధి బుద్ధి...
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు...
ఇంద్రియాలే కదిలే గుర్రాలు..
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం...
కళ్లెం అనేది జీవిలో మనస్సు...
మనస్సు అదుపులో ఉంటే మాధావుడు లేకుంటే మానవుడు...

ఓం నమః శివాయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...