Tuesday, June 8, 2021

శివోహం

హృదయం సంతృప్తి పడితేనే...
విశ్వమంతా ప్రేమమయం...
హృదయ దీపం వెలిగితేనే...
పృథ్విఅంతా వెలుగుమయం...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, June 7, 2021

అమ్మ

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే !
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !

అమ్మ దయా ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అమరుల నిను మెప్పించిరి...
అసురులు నిను ద్వేషించిరి...
బ్రహ్మాది దేవతలు మునులు మహావిష్ణువు నిను చేరి కోరి
అసుర ఆగడాలు వివరించి నివారణ తరుణోపాయము
కోర విష్ణుమూర్తి గరళం సృష్టించ దాచితి కంఠమున...
ఆ విధమున సురుల రక్షించి అసుర సంహార కారకుడైన నిను చేరి ప్రార్థించున్న నన్ను దయతో నీవే కావుము ఫణి భూషణ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నిర్మలమైన రూపం...
ప్రకృతినే నీయందు నిలుపుకున్నావు...
సుందర రూపుడవు నీవు...
భౌతికంగా నీచిత్రం ఇంత అందంగా ఉంది...
మరి అంతరంగాన నీదర్శనమెప్పుడిస్తావు తండ్రి...
నిజ దర్శన భాగ్యం కలిగే రోజులున్నాయ...
అత్యాశ అనుకోకు శంభో నన్ను ఆశీర్వదించు..

మహాదేవా శంభో శరణు....

Sunday, June 6, 2021

శివోహం

అహం...
అహంకారం...
మొదటిది పారమార్ధికం
రెండవది ప్రాపంచికం....
అహం అంటే 'నేను' అని అర్ధం. 
ఆ అహం ఆకారంతో చేరితే అది అహంకారం.
యదార్ధ అస్తిత్వం 'నేను'. 
అపరిమితమైన 'నేను'ని పరిమితమైన మాయ ఉపాధికి చేర్చి చెప్పడం అహంకారం...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

ఏమైతేనేమి
ఏదైతేనేమి
మనస్సు తృప్తి పరిచే శివ నామ స్మరణే చాలు...

మహాదేవా శంభో శరణు...

Saturday, June 5, 2021

శివోహం

హరిని తలచినంతనే
తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు.
అంతేకాదు, ఆయన్ను నమ్మిన వారికి మనోబలాన్నీ, బుద్ధిని ప్రసాదిస్తాడు...
హరి నామ స్మరణ ను జపించనంతనే
సమస్త పాపాలు తొలిగిస్తాడు సదా రక్షిస్తాడు...

హరి నీవే సదా మాకు రక్ష...

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల