Friday, July 9, 2021

శివోహం

నా మదిలో నీ గోపురాలు మందిరాలు...
నా ఎదలో  నీ సుందర రూపం నిండి ఉండగా...
భాష భావం మూగవోయి నీరాగంతో
వైరాగ్యం కలిగి నిన్నే చూస్తూ కాలం గడిపేయాలని ఉంది 
ఆభావం కలకాలం నిలపవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నాకు ఆధారము నీవు మాత్రమే..
ఈ బంధాలు పెనవేసుకునేవే గాని...
విడిపించేవి గావు..
అసలైన స్వేచ్ఛ నీ దగ్గరే శివ...
నీవే శరణు..
మహాదేవా శంభో శరణు...

Thursday, July 8, 2021

శివోహం

నీ వైపు నే వేసే ప్రతి అడుగూ 
నన్ను నాలోకి నడిపించే దారిలో మజిలీ..
నిన్ను చూపే నా ప్రతి కలా
నా ఉనికిని వెలిగించే వెన్నెల..
నువ్వొక్కటీ నేనొక్కటీ కాదు కదా తండ్రి...
నువ్వే నేను నేనే నువ్వు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ...
నాతో ఆడుకోవాటినికి నీనుండి నన్ను దూరం చేసి కలియుగంలో పంపి దాగుడుమూతలాడుతున్నావు...

పోనీ నీ పాదాలు దొరికినవి కదా అని సంబరపడుతుంటే
అందాల ఆశ చూపి , సంపదలు చూపించి , బందం తో బందీని చేసి ఇక్కడ కూడా దూరమే చేస్తున్నావు...
ఎన్ని జన్మలైనవో ఈఆట మొదలుపెట్టి...
ముగుంపు నీయరా పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...

Wednesday, July 7, 2021

శివోహం

శంభో...
నీ నామ స్మరణమే నామనసుకు తెలిసినది...
భౌతికంగా దేహం నిదురపోయినా
మానసికంగా నిన్నే తలచును నామది...
హృదయం నిండా నిండిపోయావు...
ఊపిరి ఉన్నా ఊడిపోయినా నేనూగేది నీ ఒడి ఊయలలోనే పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నీ నామ స్మరణమే నామనసుకు తెలిసినది...
భౌతికంగా దేహం నిదురపోయినా
మానసికంగా నిన్నే తలచును నామది...
హృదయం నిండా నిండిపోయావు...
ఊపిరి ఉన్నా ఊడిపోయినా నేనూగేది నీ ఒడి ఊయలలోనే పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, July 6, 2021

శివోహం

మనస్సు నిర్మలమైన కొద్ది దాన్నినిగ్రహించడం సులభమవుతుంది. మనోనిగ్రహం వళ్ళ ఏకాగ్రత సాద్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్ధంగా కార్యాన్ని నిర్వహించవచ్చు. 
                                                స్వామి వివేకానంద

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...