Monday, July 12, 2021

శివోహం

నా మనస్సు ఒక కోతిలాంటిది...
దానికి స్థిరం తక్కువ...
కోతి అడవుల్లో తిరిగితే...
నామనస్సనే ఈ కోతి ఎల్లప్పుడు మోహం అనే అడవుల్లో తిరుగుతు ఉంటుంది....
ఇది చాల చంచలమైనది....
తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతో ఉంటుంది...
నా స్వాధీనంలో లేదు....
దాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు...
నేను అశక్తుణ్ణి నువ్వు నా మనస్సు అనే కోతిని భక్తి అనే పగ్గాలతో గట్టిగా బంధించి నీ అధీనంలో ఉంచుకో...
నీకు భుక్తి నాకు ముక్తి రెండూ లభిస్తాయి.
మహాదేవా శంభో శరణు...

ఐవోహం

సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది...
దైవం (శివుడు) ఓంకార ప్రేమ స్వరూపం...
ఆయన రూప రహితుడు...
నాశన రహితుడు, నిర్గుణుడు...
ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు...
సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శంభో...
జ్ఞాన నిడివి నీవు...
నిన్ను తెలుసుకొనగా నాకింత జ్ఞానం ఇయలేవా...

మహాదేవా శంభో శరణు...

Sunday, July 11, 2021

శివోహం

జ్ఞానమేది
అజ్ఞాన మేది అనేది తెలుసు కోవటము లోనే సగము జీవితము వ్యర్ధమై పోతుంది శివ...
సుఖాలకోసం, కోరికలు తీర్చు కోవటం కోసం సగములో సగము  జీవితము నిద్రలో మినిగి పోతుంది...
మనసారా నిన్ను కొలిచేదెన్నడు...
తనివితీరా నీ నామం జపించేది ఎన్నడూ...

మహాదేవా శంభో శరణు...

ఐవోహం

నా కన్నీటి వెనుక కథ ఏమిటో నీకె తెలియాలి...
శివ నీ దయ...

Saturday, July 10, 2021

శివోహం

మిమ్మల్ని మీరు నిరంతరం సానుకూల స్థితిలో వుంచుకోoడి మరియు మీ మనస్సును దేవుని ఆలోచనలతో నింపండి....
మీరు చీకటి గదిని కాంతివంతం చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా చేస్తారో ఆ విధంగా మీ మనస్సుతో వ్యవహరించండి...
మీరు చీకటితో పోరాడకండి. మీరు చీకటిని వెలుగులోకి తీసుకురండి, అప్పుడు చీకటి తొలగిపోతుంది...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
నా తనువుకు తలపులు కలిగించి...
నా మనసు తలుపులు తెరిపించి...
*నేను* గురించి నాతో శోధన చేయించి...
నా *ఆత్మ* నిదని తెలుపు...
నువ్వే నేనని నేనే నివని ఋజువు చేయించు...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...