Tuesday, July 20, 2021

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కాలగమనంలో కదిలే క్షణాలలో...
ఊపిరి ఊయల శివ పార్వతుల ధ్యానం చేయుచుండగా వినిపించే గుండె చప్పుడు ఓంకారమై...
విశాల లోకాలు ఆవరించి మహాదేవుడు
మదిలోకి ఉరుకుల పరుగుల నాట్య
మాడుచూ నా మనసు ముంగిట
నటరాజుగా నిలిచినాడు సతి పార్వతితో

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, July 19, 2021

శివోహం

శంభో...
జన్మ జన్మల జ్ఞాపకాలు
పాపాల రూపంలో గుర్తు
వచ్చి మనసు మూలుగుతోంది...
బాధతో, భయంతో.....
ఎవరికి చెప్పుకోను...
నీకే అప్పచెబుతున్నాను నన్ను నీ దరిచేర్చుకో...

మహాదేవా శంభో శరణు...

Sunday, July 18, 2021

శివోహం

శంభో
ఈ భువిపై నాచే నీవు ఆశించిన 
కార్యములు పూర్తి కాలేదనేనా...

ఈ యాతనల యాత్రల పొడిగింపు...
లోతు తక్కువ కొలనులు ఈద గలిగినా ప్రవాహాలు దాటలేకపోతున్నాను.
 పరమేశ్వరా...
నీ అభయహస్తం అదించి నీ దరికి చేర్చు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

Saturday, July 17, 2021

శివోహం

గరికకు లొంగిపోయే గణేశుడు భక్తసులభుడు...
ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు...
తండ్రి వలె దయగల మారాజు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు...

ఓం గం గణపతియే నమః

శివోహం

కొలుతును నే మణికంఠుడిని... 
కొలుతును నే హరిహర పుత్రుని...
కొలుతును నే విఘ్నేశ్వర సోదరుని....
కొలుతును నే శంభు తనయుని...

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...