Sunday, November 28, 2021

శివోహం

దేహమను క్షేత్రంలో
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు
ప్రేమ అను జలాభిషేకమును
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత....
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

శివోహం

శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు...
ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది.

ఓం నమః శివాయ

శివోహం

దేహమే దేవాలయం...

జీవుడే దేవుడు

శివోహం

జన్మజన్మ పాపాలు
నన్ను వెంటాడు చుండగా 
శాపములా కోపం
నన్ను చుట్టు ముట్టు చుండగా   
ధైర్యము అందించే నా మనస్సులో నీ ఉండగా  
నీ నామ జపమే నాకు రక్షణగా ఉన్నది శివ...

మహాదేవా శంభో శరణు.

గోవిందా

ఉంచుకోడం లోకన్నా...
పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది...
పరమాత్మ తత్వ చింతనతో...
మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది...

హరే కృష్ణ...
ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ

శివోహం

శంభో...
ఈ దేహం శిధిలమవ్వకముందే
నా హృదయమందున్న నిన్ను చూడాలి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మురికి కొంపగ పేరు పొందిన దేహం....
నిన్ను పూజించడం...
నిత్యం నీ నామ స్మరణా చేయడం 
వల్లే వెలిగిపోతోంది తండ్రి...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...