Wednesday, December 1, 2021

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి...
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారే..
మారినవారు మరల మారలేదు...
కాని...
నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా...
నన్ను ఏదారిలో నడుపుతావో శివ అంత నీ దయనే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
నీటి బుడగ లాంటి ఈ జీవితం పై నాకేమి మమకారం లేదు తండ్రి...
అలాంటిది నీకు అంత మమకారం ఎందుకో...
ఒక చిన్న చిల్లు పెట్టారదు...
వచ్చి కైలాసం లో తిష్ట వేస్తా...
ఎక్కడో ఓ చోట మూలన పడివుంటా...

మహాదేవా శంభో శరణు

శివోహం

శంభో...
ఒకే ఒక కోరిక కోరాలని ఉంది...
అందరికీ దూరంగా సుదూరంగా..
స్వేచ్చా విహంగంలా.. ఆకాశమే హద్దుగా..
నాకునేనుగా విహరించేలానైనా శక్తినివ్వు...

కాని పక్షంలో..
హాయిగా నీ ఒడినిచేరుకునేలానైనా నాకు వరమివ్వు...

ఏమి ఇచ్చిన నాకు సంతోషమే శివ...

మహాదేవా శంభో శరణు.

అయ్యప్ప

హరిహారపుత్ర అయ్యప్ప...
మా మనుగడకు రక్షణ కవచంలా సూర్య చంద్ర భూమి ఆకాశ జల అగ్నివాయు అవకాశాల సమకూర్చి...
ఈ ప్రాణికోటికి నీవు కన్న తండ్రి వలె రక్షణగా  నిలుస్తున్నావు అయ్యప్ప...
ఏమిచ్చి ఋణం తీర్చుకొన గలం స్వామీ... అనుదినం...
కృతజ్ఞతతో అంజలి ఘటించడం తప్ప....

శబరిగిరి నివాస అయ్యప్ప మా దేవా శరణు.
మహాదేవా శంభో శరణు....
ఓం నమో నారాయణ

Tuesday, November 30, 2021

శివోహం

శంభో...
జీవితం అంతులేనిదీ...
జీవితం అంతుతేల్చలేనిది...
ఉదయ సంధ్య ఎడారులలో సాగిపోతుంటది...
ఎండమావి ఆశల వెంట పరుగుబెట్టిస్తది...
నల్లేరు ఎడారులలో తింపుతూనె ఉంటది....
మాయగాడివి నీవు...
నీ మాయ అనే తెలుసు...
నీవు ఆడే ఆటలో అడలేకున్నాం స్వామి...
మహాదేవా శంభో శరణు.

Monday, November 29, 2021

శివోహం

మనకు అన్నీ భగవంతుడే ఇస్తే
ఆయనకు మనమేమి ఇవ్వగలం
అలాగని ఏమీ ఇవ్వకుండా ఉంటే
కృతజ్ఞత అవుతుంది కదా !
తల్లిదండ్రులు మనకు ఎన్నో ఇచ్చారు
మనం అనుభవిస్తున్న జీవితం
వారు అనుగ్రహించిందే
ఇంక వారికేమి ఇవ్వగలం
అలాగని వదిలేయలేం కదా !
వారియెడల భక్తిని కలిగి ఉండాలి
మనం ఏ చిన్న సేవ చేసినా
మురిసిపోతారు తల్లిదండ్రులు
భగవంతుడుకూడ అటువంటి
అల్పసంతోషియే ఏ కొంచెమిచ్చినా
పరమానంద పడిపోతాడు
అటువంటిది మననే కానుకగా
సమర్పిస్తే ఎంత మురిసిపోతాడు
అంటే బ్రహ్మస్మి అనే భావంతో
నీవే నేననుకో అనే భావాన్ని
వ్యక్తం చేయడమే నిజమైన కానుక

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, November 28, 2021

శివోహం

రూపాలు ఎన్ని ఉన్నా...
నామాలు ఎన్ని ఉన్నా...
మార్గాలు ఎన్ని ఉన్నా...
గమనాలు  ఎన్ని ఉన్నా...
బోధలు ఎన్ని ఉన్నా...
కథనాలు  ఎన్ని ఉన్నా...
సాధనాలు ఎన్ని ఉన్నా...
శోధనలు  ఎన్ని ఉన్నా...
ఉన్నది పరబ్రమ్మం ఒక్కటే తుదకు అందరి గమ్యం ఒక్కటే...
ఓం శివోహం సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...