Friday, December 24, 2021

శివోహం

భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు...
బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల...
ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపేబ్మరేదో పట్టిలాగేసుకుంటాడు...
బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు...
మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి...
అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది...
ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది.

ఓం శివోహం... సర్వం శివమయం.
స్వామి జ్ఞానదానంద

Thursday, December 23, 2021

శివోహం

శంభో...
మురికి కొంపగ పేరు పొందిన దేహం....
నిత్యం నిన్ను పూజించడం...
నిత్యం నీ నామ స్మరణా చేయడంవల్లే వెలిగిపోతోంది తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

గోపాలా...
నీ చరణ దర్శనం మా ముక్తి మార్గం...
నీ పాద ధూలీ మా నుదిటి విభూతి...
నీ అభయహస్తం...
మాకు ప్రసాదించే అభయయం...
నీ కమల నయనాలు కురిపించే కారుణ్యం...
నీ వేణుగానం తో పరవాసించే సమస్త విశ్వం
నీ నామా స్మరణ తో సర్వపాప హరణం...
జగన్నాథ ఈ మాయ నుండి విడిపించి మొక్ష మార్గం వైపు నడిపించు..
పరంధామ కృష్ణ ముకుందా గోవింద గోపాల శరణు...

హరే క్రిష్ణ.

శివోహం

శంభో
ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం...
ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీ ఆశీర్వాదములు మాకు ఆనందాయకం...
నీకై నేను జన్మించాను నాకై నీవు ఉదయిస్తున్నావు
నీలో నేనే నిలిచిపోయాను నాలో నీవే కలిసిపోయావు...

మహాదేవా శంభో శరణు...

Wednesday, December 22, 2021

అమ్మ

అమ్మ
కరుణాసముద్రి...
దయాసాగరీ...
ఆపదల యందు నిన్ను స్మరిస్తున్నానని తప్పుగా భావించకమ్మా...
ఇది సహజమే కదమ్మా తల్లి...
ఆకలిదప్పులున్నప్పుడే...
బిడ్డలు తల్లిని స్మరిస్తారు...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉనట్టే...
సర్వేశ్వరి నీవే శరణు

శివోహం

శంభో...
నన్ను దిద్దుకో...
సన్మార్గంలో
సద్బుద్ధితో
సద్భావనతో నన్ను నడిపించి...
తరింపజేసే భారం బాధ్యత నీదే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
 బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని... ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు...
ఆ ఇల్లు ఈ ఇల్లు ఎన్నాళ్లు తిప్పుతావు తండ్రి...
కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో తండ్రి...
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...