Tuesday, December 28, 2021

శివోహం

ప్రేమికుడంటే పరమేశ్వరుడే...
అమ్మకి తనలో సగానిచ్చి జనానికి ప్రేమతత్వాన్ని బోధించిన ఆది ప్రేమగురువు నా శివుడు...
ప్రేమిస్తే శివుడిలా ప్రేమించాలి...
శివుడిలా ఆ ప్రేమను గెలిపించుకోవాలి...
శివుడిలా ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, December 27, 2021

శివోహం

శంభో...
మనసులో ఎన్నో ఆశలు పుట్టిస్తావు...
కోర్కెల వెంట పరుగులు తీయిస్తావు...
బంధాలలో బంధిని చేసి మము ఇరికిస్తావు...
నీవు ఆడే ఆటలో బొమ్మలను చేసి...
నీకు తోచినట్టు మలచుకుంటావు...
చిత్రమయ్యా నీ లీలలు అంతుపట్టదు...
శంభో నువ్వు ఆడే ఆటలు నేను అడలేను...
జీవితం లో మళ్ళీ మళ్ళీ నేను ఒడిపోలేను...
నా దారి నీ వైపు మళ్లించి నన్ను గెలిపించు

మహాదేవా శంభో శరణు...

Sunday, December 26, 2021

శివోహం

మిమ్మల్ని మీరు నిరంతరం సానుకూల స్థితిలో ఉంచుకోండి మరియు మీ మనస్సును దేవుని ఆలోచనలతో నింపండి...
మీరు చీకటి గదిని కాంతివంతం చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా చేస్తారో ఆ విధంగా మీ మనస్సుతో వ్యవహరించండి...
మీరు చీకటితో పోరాడకండి...
మీరు చీకటిని వెలుగులోకి తీసుకురండి, అప్పుడు చీకటి తొలగిపోతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, December 25, 2021

శివోహం

ఈ భోగ భాగ్యాలూ  సుఖసంతోషాలు 
అన్నీ  తాత్కాలిక మైనవే...

భగవంతుని కరుణ దయ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ పంచేద్రియాలను నిగ్రహించుకుని పరమాత్మకై తపించాలి...

ఇతర విషయాలపై మన దృష్టిని కేంద్రీకరిస్తే కాలం వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు...

ఇతర విషయాలపై  నీ  మనస్సునీ  బుద్దిని కేంద్రీకరించకు...

సదా నన్ను  గుర్తుంచుకో  అప్పుడే  నీ  జ్ఞాన చక్షువులు 
లౌకిక విషయానురక్తిని వీడి శాశ్వాతానంద ముక్తి మార్గం వైపు పయనించి  నిన్ను  పరిశుద్ధణ్ణి చేస్తాయి స్థితప్రజ్ఞుడవు  అవుతావు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శంభో...
నా తపమును మూలాధారం నుండి సహస్రారం చేరటానికి ఇంకా ఎన్ని చక్రాలు దాటాలి శివా.
నా యాతన మూలాధారం నుండి ముందుకు కదలడం లేదు...
ఉపచక్రాలు ఎన్ని ఉన్నాయో శుద్ధి చేసుకునే దారి
చూపి నన్ను నీ దరికి చేర్చుకో పరమేశ్వరుడా...

మహాదేవా శంభో శరణు.

Friday, December 24, 2021

శివోహం

భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు...
బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల...
ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపేబ్మరేదో పట్టిలాగేసుకుంటాడు...
బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు...
మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి...
అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది...
ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది.

ఓం శివోహం... సర్వం శివమయం.
స్వామి జ్ఞానదానంద

Thursday, December 23, 2021

శివోహం

శంభో...
మురికి కొంపగ పేరు పొందిన దేహం....
నిత్యం నిన్ను పూజించడం...
నిత్యం నీ నామ స్మరణా చేయడంవల్లే వెలిగిపోతోంది తండ్రి...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...