Sunday, January 9, 2022

శివోహం

నా శ్వాసే నీవన్న ఎదో ఓ రోజు ఊపిరి తిస్తావు...
నేను బ్రతుకేది నీకోసమన్నా చివరికి చితినే పెరుస్తావు...
నా సొంత వాళ్ల కోసం ఎన్ని కలలు కన్నా కల గానే మిగిలిస్తావు...
చివరకి అన్ని బంధాలు తెంచుకోని నీ దగ్గరికి రమ్మంటావు...
నీ లీలలు తెలియ నా తరమా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆరాధన అనేది అద్భుతమైన...
అందమైన మధుర భావం....
అది త్రిగుణా తీతం
అలౌకిక ఆనంద భరితం...
అనుభవైక వేద్యం కూడా...

ఓం శివోహం... సర్వం శివమాయం

శివోహం

హనుమా నీ రూపే వేరు...
భక్తికి పరాకాష్ట నీ నడక...
రాముడు లేని చోట నీవుండవు...
శ్రీరామ నామము జపిస్తూ నీవు నడయాడే నేల పవిత్రము...
వీరులకు వీరుడు ఎవరంటే నీవె అతి భయంకర వీరుడవు...
లంకను రావణ చెరనుండి రక్షించిన శ్రీరామ భక్తుడవునీవు...
నన్ను నీ దరికి చేర్చుకోవయ్య శ్రీఆంజనేయ...

శ్రీరామభక్త హనుమ శరణు.
జై శ్రీరామ్... జై జై శ్రీరామ్

శివోహం

మనం అంతమయ్యే వరకు...
అన్ని అనుభవించాల్సిందే...
అవి  బాధలైనా ,సంతోషలైన...
ఎందుకంటే ఆపదకి  సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు...
బంధాలకి  బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు...
బ్రతుక్కి చావు నచ్చదు...
ఇన్ని నచ్ఛకున్నా మనల్ని నలుగురు మోసే వ్యక్తుల మనసులో ప్రేమ సంపాదించనప్పుడు మనం  బ్రతికివున్న శవమే....
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, January 7, 2022

శివోహం

హరి నామమే కడు ఆనంద కరము...
హరి నీ సాక్షాత్కారము సకల పాప హరణం...
హరి నీ దర్శనం ,భవరోగ నివారణం...
హరి నీ స్మరణం పూజనం ,సేవనం , జన్మ జన్మల పుణ్యఫలం...

ఓం నమో వెంకటేశయా
హరే గోవిందా...
ఓం నమో నారాయణయా నమః
హరే రామ హరే క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ హరే హరే

శివోహం

ఆశగా వున్నాది శివా నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కనులార నినుచూసి ఈ జన్మ తరియించి పోవాలని...

కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను

మహాదేవా శంభో శరణు...

Thursday, January 6, 2022

శివోహం

అంటరాని తనం అంటని చోటు అది...
కుల మతాలు కనిపించని చోటు అది...
నా ప్రాణనాధుడు ఉండే చోటు అది...
అదే అదే నా శాశ్వత నిలయం అది...


ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...