Wednesday, January 12, 2022

శివోహం

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని
తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె
నిలువెచ్చని రవికిరణం...
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు పెద్దలకు ,గురువులకు ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు....

ఓం

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు, పెద్దలకు,గురువులకు, ఆత్మీయ మిత్రులకు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) శుభాకాంక్షలు.

సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి రోజు స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే  సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని అందుకే మోక్షద ఏకాదశి అని అంటారు.
శ్రీ మహా విష్ణువు మూడుకోట్ల మంది దేవతలతో కలసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అష్టాదశ పురాణాల్లో ఉంది.

శివోహం

ఇష్టం ఉన్నంత వరకు కొందరు...
కష్టం కలగనంత వరకు కొందరు...
కన్ను మూసే వరకు కొందరు...
కట్టే కాలెంత వరకు కొందరు...
కొంత కాలమే ఎవ్వరైనా...
కడకు నిలిచేది మన బంధమే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

Tuesday, January 11, 2022

శివోహం

శభరీశ్వర...
పాశాంకుశ ధారి....
పాపధ్వంసకం ధారి....
భవబంధ మోచక ధారి.....
నా మదిని భక్తి తో కరిగించి నీకు కర్పూర హారతిగా అర్పింతును...
నా శరీరం అనే నారికేళం లో అహం అనే నెయ్యి నింపి నీ కొండకు వస్తా...
న అహం ను తొలిగించు నీ ముక్తి మార్గం చూపించు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శంభో ! సర్వ జ్ఞానివి... 
సమస్త లోకాలను ఏలే వాడవు... 
సకల శుభాలను ఇచ్చేవాడవు... 
సకలమూ ఎరిగిన వాడవు... 
సమస్తమూ వ్యాపించిన... 
ఆనంద తాండవ నటరాజా... 
మాత బాలాత్రిపురసుందరిదేవితో 
కూడి నాకు జ్ఞానఐశ్వైర్యాన్ని ప్రసాదించుము... 
నన్ను అనుగ్రహించుము తండ్రీ... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

కఠిన దుఃఖ బాధలైనా...
గుండెల్లో ఊపిరి భరువైనా...
స్థితి గతులే మారినా...
నీ ఆరాధన ఆపను...
నీ ధ్యానం అపను...

మహాదేవా శంభో శరణు...

Monday, January 10, 2022

శివోహం

నీకై పిలిచి పిలిచి నా స్వరము  తరిగి
పోయినదిరా పమేశ్వరా...
నాకై  నీవు  పిలువగా...
నీ  స్వరము  వినాలని మది...
ఎదురుచూపురా ఈశ్వరా ఇది...

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...