Wednesday, August 17, 2022

శివోహం

వేగిరపడుతున్న ఈ మనసుని నువ్వు ఎప్పుడు ఆదరిస్తావు స్వామి...
నీ అడుగుల తివాచీలా ఉబలాటపడి పరిచిన  హృదయ సీమకి నువ్వు వచ్చేవనిబీఅంతా నీ అడుగుల  అచ్చులే ముద్రితమని తెలిసేరోజు కోసం ఈ జీవిత సమస్తంవేచిఉన్నది...
ధర్మానికి వేదిక నీ ముందర ఉండడమే నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా మారి ఉన్నాను...
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి దాటెందుకు నీచేయూతలో
నాలోనుండి నాలోకి ప్రయాణించే గమనాన్ని వేగంగా మార్చు, మరెక్కడ ఆగకుండా నిన్ను చేరేందుకు ఉరవడి ఉండనీ గట్లు తెగిపోయి స్వామి...
ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, August 16, 2022

శివోహం

ఆధ్యాత్మికత అంటే చేస్తున్న వృత్తిని వదిలేసి 
ఆలయం లో గడపడం కాదు...

ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం...

చేస్తున్న పనిపై ఏకాగ్రత చూపడం ఆపని పది మందికి ఉన్నతికి తోడ్పడటం...

అదే ఆధ్యాత్మిక తత్వ రహస్యం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, August 15, 2022

శివోహం

విడువ వలసినది నా అన్న భావము...
పట్టవలసినది శివ పాదము...
పొందవలసింది  శివ దామము ఎరుక కలిగితే దక్కును ఆ భాగ్యము...
ఎరుక లేకున్న వచ్చును మరో జన్మము...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మీ కుటుంబంలో చేర్చుకుంటావని...

నందిని చూసే దిశలో నీ వెనుకనే నిలుచుని ఉన్నాను శివ...

నన్ను నీ కుటుంబం చేర్చుకోవాలని సిఫార్సు చేయమని నందికి ప్రతిరోజు చెవిలో చెబుతున్నాను...

ఆర్తిగా నీ కుటుంబంలో ఓ మూల ఇంత చోటు ఇయవా తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Sunday, August 14, 2022

శివోహం

మువ్వన్నెల జెండా రెపరెపలాడెను భారతీయుల యద నిండా...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.

శివోహం

ప్రాప్తం లేదని బాధపడకు...
ప్రయత్నం మాని చింతించకు...
సహాయం దొరకలేదని ఆలోచించకు...
సమయం వ్యర్థం చేయకుండా సాగించు నీ గమ్యం వైపుకి...
స్మరించు భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆ శివుడే చూపించు నీ మజిలీని...

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, August 13, 2022

గోవిందా

సీతా నాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
లక్ష్మీ పతయే గోవిందా
లక్ష్మణాగ్రజా గోవిందా
దశరధ నందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాండవప్రియనే గోవిందా
బలరామానుజ గోవిందా
భాగవతప్రియ గోవిందా
గోకులనందన గోవిందా
గోవర్ధనోధ్ధార గోవిందా
శేషశాయినే గోవిందా
శేషాద్రినిలయా గోవిందా

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...