Monday, October 31, 2022

శివోహం

శివ మహదేవా దయచూపు తండ్రి... 
జగత్తులోని సర్వ ప్రాణులమీద...
తెలిసో తెలియకో తప్పులు చేస్తాం...
దండించి అయినా నీ దారిలో మము ఓసగు...
నీ పాదముల చెంత చేరుటకు కాసింత బుద్ది నొసంగు...

మహదేవా శంభో శరణు.

Sunday, October 30, 2022

శివోహం

శివాసదాశివాయ... 
సదా లోక కళ్యాణ కారణాయ... 
సదా సృష్టి సంరక్షకాయ... 
సర్వ జీవ పోషకాయ... 
ఆరోగ్య ప్రదాయ... 
అంబ సమేతాయ... 
మహాదేవాయ... 
మంగళప్రదాయ... 
శ్రీ వైద్యనాథాయ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

భగవంతుని సత్య సంకల్ప రూపం ప్రకృతి...
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, October 28, 2022

శివోహం

సకల ప్రాణికోటికి తల్లీవి కదా అమ్మ...
నీ బిడ్డల కళ్ళల్లో అశ్రువు లు స్రవిస్తే...
మాతృహృదయం కరిగి పోదా అమ్మ...
జర నువ్వైనా చెప్పమ్మా అయ్యతో...
ఆయన ఆడే ఆటను అడలేనని...
ఆటను ముగించమని నువ్వైనా చెప్పవమ్మా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి.

ఓం శివోహం... సర్వం శివమయం
ఓం శ్రీమాత్రే నమః.

Thursday, October 27, 2022

శివోహం

శంభో...
సూర్యునివలే ప్రకాశవంతంగా... 
చంద్రునివలే ప్రశాంతంగా... 
సంద్రంవలే జ్ఞానవంతంగా... 
పృథ్వివలే సహనంగా నన్ను నిలిపి...
ఈ బ్రతుకు పోరులో నను గెలిపించండి తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

Tuesday, October 25, 2022

శివోహం

శివ...
నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి...
దుఃఖాలు తొలగుతాయి...
లౌకిక సుఖములందు విరక్తులౌతారు...
జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు...
అందుకే నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు తండ్రి...
దానివల్ల కలిగే ఆనందనుభవంచే అలవికాని నా బాధలను మరిచిపోయి నీ పాదపద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవుడికి ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఈ జగత్తు ఈశ్వరుడి క్రీడా...
ఆయన ఆడే ఆటలో ఓడినావారెవరు ఉండరు గెలిచిన వారు అసలే ఉండరు...
ఎందుకంటే జీవుడే శివుడు కనుక.

ఓం నమః శివాయ.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల