Thursday, February 2, 2023

శివోహం

శివా!మనసేమో గునుస్తోంది
మహేశా శరణంటూ                  కదలికలంటున్నాయి కైలాసానికి పదమంటూ               "నేనే"మో అంటోంది అది నీలోనే ఉందంటూ                    మహేశా ..... శరణు

శివోహం

నిద్ర పట్టని  వానికి రాత్రి  ఎక్కువ కాలంలా అనిపిస్తుంది...
అలసిన వానికి మైలు దూరము అనంతంలా అనిపిస్తుంది...
మంచిగా జీవించటము తెలియని వానికి జీవితము దుర్భరమనిపిస్తుంది...

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి

Wednesday, February 1, 2023

శివోహం

నిను చేర నా ప్రయత్నం బగ్నం చేసేది నీవే...
రమ్మని పిలిచేది నీవే...
రానివ్వ కుండా అడ్డుపడేది నీవే...
అంతా నీవే అన్నీ నీవే...
సర్వం నీవే...
ఎక్కడ వున్నావని 
ఎతకడం నా అవీవేకం కదా శివ...
నాలో వున్న నిన్ను తెలుసుకోక పోవడం 
నా తెలివి లేని తనమే హర...
నిను తెలుసుకొన నాకు జ్ఞాన భిక్ష ప్రసాదించవా పరమేశ్వర...

మహాదేవా శంభో శరణు.

శివోహం

కొందరు దురదృష్టవంతులకు కష్టాలు కమ్ముకున్నప్పుడు ఆ భగవంతుడు గుర్తుకు రాడు... తరువాత బాధ పడతాడు...
తన స్వామిని ఎందుకు వేడుకోలేక పోయానని...
దానినే పూర్వజన్మ జ్ఞాన సంపత్తి అన్నారు పెద్దలు...
అందుకే ఆ సమయం వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే  శివ నామ స్మరణం చేయండి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, January 31, 2023

శివోహం

శివా!దేహీ అంటున్నాను దేహంతో
పాహీ అంటున్నాను ప్రణతులతో
సోహం అంటున్నాను శ్వాసతో
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!మంగళములు కూర్చు నీపైన మనసు పెట్టి
ఎంగిలి కాని రీతి ఎలుగెత్తి పిలుస్తున్నా
 నీ పదములంటి ప్రణతులు అర్పిస్తున్నా
 మహేశా . . . . . శరణు .

శివోహం

నీ ఆశీర్వాదం లేకుండా...
కలియుగంలో నా మనుగడ సాగించడం చాలా చాలా కష్టం మణికంఠ...
నేను తినే ఈ నాలుగు మెతుకులు నీ బిక్షే...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...