Friday, April 7, 2023

వైర భక్తి


భగవంతుడు క్షమాగుణం కలవాడు అయినా కొందరిని ఎందుకు శిక్షిస్తాడు?, అలాగే తాను సంహరించిన రాక్షసులకు మోక్షాన్ని ప్రసాదించి తనలో ఎందుకు ఐక్యం చేసుకుంటాడు? అనేవి చాలామందికి తరచుగా జనించే ప్రశ్నలు. 

భగవంతుని పైన భక్తిని ప్రదర్శించే విధానాలలో వైర భక్తి అనేది కూడా ఒక విధానం. కొంతమంది భక్తుల కన్నా కూడా ఎక్కువగా భగవంతుని గురించే ఆలోచించేవారు రాక్షసులు. వైరీ భావం తోనే భగవంతుని తత్వాన్ని, ఆలోచనా విధానాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు. ఎందుకు చేస్తున్నామనేది కాకుండా, ఇలా మనసును ఎంత ఏకాగ్రతగా భగవంతుని పైన నిమగ్నం చేస్తున్నాం అనేదే ప్రధానం. జయ విజయులు కూడా శాపగ్రస్తులై రాక్షస జన్మ తీసుకుని వైర భక్తి మార్గంలోనే త్వరగా భగవంతుని సన్నిధి కి చేరారు. 

శివోహం

ఈ బందాలు నేనే కోరివుంటాను...
ఇచ్చేసావు నీవు...
పసిపిల్లవాడు అడిగితే హాలాహలం ఇవ్వవచ్చా నాన్నా....
మహాదేవా శంభో శరణు 

శివోహం

శివా!నీవు లింగాన గాని
మాకూ అంగాల అగుపించవా
ఇది మాకు శిక్షా లేక పరీక్షా
మహేశా.....శరణు .

Thursday, April 6, 2023

హనుమా శరణు

ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా...
ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా...
తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు...
దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు...
నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో హనుమా...
శ్రీరామ భక్త హనుమా శరణు.

జై శ్రీరామ్ జై జై హనుమాన్.

శివోహం

శివా!నిన్ను చూడాలని వచ్చాను
నేను నేనుగా నీ పాదాల పడ్డాను
ఎగబాకి ఎదచేరి నీలో ఏకమైపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
సర్వ రోగ భవ భయ హర్తవు నీవే...
సకల లోక పాలన కర్తవు నీవే...
పత్ర పుష్ప ఫల తోయ అర్పణతో నే తృప్తి
పొందు భోళా శంకరుడవు నీవే...
శరణంటే మరవక వచ్చి రక్షించే విభుడవు నీవే..

మహాదేవా శంభో శరణు.

Wednesday, April 5, 2023

శివోహం

పూజకు వేళాయేను ప్రార్థన మొదలయ్యేను
సూర్యోదయముతో మేధస్సే ఉత్తేజమయ్యేను 
పుష్పాలన్నీ వికసించేను ని కోసమే
సుమ గంధాలన్నీ వీచేను నీ కోసమే
మెరిసే సువర్ణాలన్నీ వెలిగేను నీ కోసమే
సువర్ణ కాంతుల వెన్నెల వేచేను నీ కోసమే .
ఇకనైనా నీ మొద్దు నిద్దురా విడరా
కైలాసం దిగిరరా పరమేశ్వరా
ఆస్తులు అంతస్తులు అడగను
బంగారం ,మణి మణిక్యాలు అడగను, 
సంపదలు నాకు వద్దు
నీ నామ స్మరణే చాలు
నీకు అభిషేకం చేయడానికి కన్నీటిని సిద్ధం సిద్ధం చేసి ఉంచాను
నా మొర ఆలకించి దిగిరరా పరమేశ్వరా!!!!

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...