తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు...
వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు....
క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు...
జాగ్రత్త మిత్రమా....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...