Monday, May 15, 2023

శివోహం

శివ...
విషమును విషమని అందురు...
విషయము కూడా విషమట...
విషము విషయ వాసనయను...
విషయము ఎరిగించ రాదా గరళకంఠ...

మహాదేవా శంభో శరణు.

Sunday, May 14, 2023

శివోహం

భగవంతుదీని ఎంతలా ప్రార్ధించిన పలకడం లేదని అనకు...
నీవు చేసిన ప్రార్ధన త్రికరణశుద్దిగా ఉందో, లేదో గుర్తించు...
మనస్సు చలించేవారికి, మాటిమాటికి సందేహించేవారికి, కుతర్కం చేయువారికి ఏ మంత్రమూ ఫలించదు....
సాధకులకు శ్రద్ధ, విశ్వాసం ప్రధానం...
యాంత్రికంగా జపం చేయకూడదు...
యాంత్రికంగా చేస్తే మనకి , టేప్ రికార్డర్
కి తేడా ఉండదు కదా....
పరిపూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్ధనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందన ఎలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును భగవంతుడు ఆలకించడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా ! ఆద మరచి నిదుర పోతే 
నిదుర లేపి నీవే ఉంటావు 
నిదుర ఆగి బెదిరి పోతే 
ఎదురు నిలిచి నీవై  ఉంటావు 
శివా ! నీ దయ

శివోహం

మనస్సు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా వుండదు....
అది దాని స్వభావం....
పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది...
అది ప్రకృతి నియమం...
అందుకే మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.... అనేక విషయ వాసనలతో నిండిపోతుంది...
కావున నామ మంత్రం ద్వారా మనస్సుని తిప్పగలిగితే, అంటే అంతర్ముఖమైతే విషయ చింతన తగ్గుతుంది...

జై శ్రీమన్నారాయణ...
ఓం నమో నారాయణ...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

భగవంతుని స్పురణ, స్మరణ, చింతనలకు దోహదపడే ఏ కర్మ అయినా మనస్సు శుద్ధికి ఒక సాధనా....                 
కలి ప్రభావం ఎంత ఎక్కువగా వున్నా, దాని బారినుండి తప్పించుకునే ఉపాయం మాత్రం చాలా సులువైనది, సరళమైనది, సూక్ష్మమైనది...
కలియుగ వాసులకు చక్కటి దివ్యౌషధాం భగవన్నామపానం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, May 13, 2023

ఓం గం గణపతియే నమః

పార్వతి పుత్ర...
శంబు తనయ...
ఆది పూజ్యుడా....
ఎలుక వాహనుడా...
కుక్షి నిండ నీకు కుడుము లిడుదు....
కరిముఖ గణపయ్య కాపాడు కరుణతో...
అర్థితోడ కొలిచి విన్నవించు కొందు....
విఘ్న రాజ కరుణతో కాపాడు.....
సమస్త దేవతా సమూహము చేత పూజించ బడెడి దేవదేవా నీవే శరణు....

ఓం గం గణపతియే నమః

మణికంఠ

మణికంఠ...
ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...