Tuesday, June 6, 2023

శివోహం

శివా!శుభాలకు నెలవు
అశుభం ఎరుగని కొలువు
నీ వాసమే అది కైలాసమే
మహేశా . . . . . శరణు .

శివోహం

అనంత విశ్వమంతయు నీవు కదా తండ్రి...
గుళ్ళు గోపురాలు నీకెందుకయ్యా...
అసురుని పొట్టలోన ఉంటావంట కదా...
నా గుప్పెడు గుండెలోన ఉండిపోవా శివ...

మహాదేవా శంభో శరణు.

Monday, June 5, 2023

శివోహం

శివుడా...
భవుడా...
శాంభవుడా...
విభూది ప్రియుడా...
త్రిశూలధరుడా...
అనంతుడా...
గిరి సంచరుడా...
శివ మహాదేవా శరణు.

Monday, May 29, 2023

శివోహం

నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి...
నరము తెగిపోవు వేదన కల్పించి నావు...
కడలి కెరటాల వడి వలె రాత్రి పగలు...
క్రమ్మి వేయుచు నుండే...
తేరుకొకమునుపే కనికరమ్మింత చూపదు నిను తలచ నీదు...
కరుణ జూపు హర విధి కాటు పడక ముందే...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అందరూ అంటారు నీ భక్తులమని
ఏ కొందరినో అంటావు  నా భక్తుడని
కొందరిలో కూడనీయి కామితఫలమీయి
మహేశా . . . . . శరణు

Sunday, May 28, 2023

శివోహం

శివా!దేహాన్ని చూసి నేనంటున్నాను
దేవాలయానికి వచ్చి నీవంటున్నాను
ఈ నీవు, నేనుల అభేదాన్ని ఎఱుక చేయి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నా ప్రక్కన ఉందువు కానీ...
నాకు  నీవు కనపడవు...
నాకు తెలియకుండ నీవు నాతోనే  పని చేయింతువు
నా ప్రతి పనికి సాక్షీగ ఉంటూ నా పని  పట్టు చుందువని నా కిప్పుడు తెలిసేనూ...
నీవెంత వింత  పనివాడవొ తండ్రి...

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...