Saturday, June 10, 2023

శివోహం

రావాలనే ఉంది శివ...
పుట్టెడు బాధలు వదిలి...
అక్కరకు రాని బంధాలను వదిలి...
నిను చేరాలనే ఉంది శివ...
ఏ పనిలో ఉన్నా, ఏ మాట పలికినా, ఏ వేళ ను గానీ,
నా తలపులో మేదిలేవు మనసులో నిలిచేవు
ఈ దేహ ధ్యాస ఉండదు...
ఏ పనిలో చిత్త ముండదు...
ఇది కావాలని ఉండదు...
నిన్ను తప్ప ఏదీ కోరదు...
ఏమీ చేతురా శివ
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!గమ్యాన్ని గమనించి గమనంలో నిలిచాను
సమయానికి నీ నామం చుక్కానిగ తోచేను
నా బాటను తోడైనావు,నా చూపుకు చూపైనావు
మహేశా . . . . . శరణు .

Friday, June 9, 2023

శివోహం

శివా!కట్టెనై కట్టెల్లో కాలేను పలుమార్లు
ఈ మట్టితో మనుగడ ఎన్నాళ్ళు
మన్నించి ముగించు ఈ తిరుగుళ్ళు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ శరీరం ఒక రథం...
మన ఇంద్రియాలే గుర్రాలు
ఆ గుర్రాల  కళ్ళాలు మనసు...
మనసు సారధి...
బుద్ది రథికుడు ఐ రథాన్ని నడిపిస్తూ ఉంటాడు...
గుర్రాలు అనే ఇంద్రియాలు మనసు అనబడే కళ్లెం చేత  లాగబడుతూ  నియంత్రణ లో ఉంటే రథం తన గమ్యం అయిన ఆత్మ సన్నిధానం వేపు చక్కగా వెళ్తూ ఉంటుంది...
కోరికలు ఉంటే , మనసు బహిర్ముఖం అవుతుంది...
కోరికలు అణగి పోతే ,అంటే ఇంద్రియాలు నియంత్రించ బడితే మనసు అంతర్ముఖం అవుతుంది.
ఓం శివోహం... సర్వం శివమయం.

హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం...
నారదునకు  నారాయణ నామము నిత్యఔషధం...
ఈ మోహనుడిని నీ నామమే నిత్యఔషధం...
మహాదేవా శంభో శరణు.

Thursday, June 8, 2023

శివోహం

శివా!కైలాస పర్వతం మంచుకొండో,
మట్టికొండో ఏదైననేమి...
అదే మాకు కొండంత అండ.
మహేశా . . . . . శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...