Friday, July 7, 2023

శివోహం

శివా!కనులు మూస్తే ఎదుటనుంటావు
కనులు తెరిస్తే మనసులో వుంటావు
మనసు మాయనీ,నిన్ను తెలియనీ
మహేశా ..... శరణు.

శివోహం

శివ...
సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ
నిన్ను మరిచిపోతున్నాం...
అహంకార మమకారాలు అనే ఇనుప గొలుసులతో కృత్రిమ అనందం అనే ముసుగులో అజ్ఞానంతో మాకు మేమే బందీలమై నీ గురించిన ధ్యాస లేకుండా నిన్నువిడచి  మరచి  బ్రతుకుతున్నా నన్ను క్షమించు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఎన్ని కష్టాలు రానీ సుఖాలు పోనీ నిన్ను తలిచే, కొలిచే పూజించే, భజించే భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు...
భావ దారిద్ర్యం రానీకు పరమాత్మా...
నీ స్మరణయే సుఖం నీ తలంపు లేని ఘడియలు కష్టం, కావున స్వామీ మంగళకరము, మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు...
శరణు జగదీశా శరణు...
ఆదిదేవా శరణు...
మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు...
మహాదేవా శంభో శరణు.

హరే కృష్ణ

లీలమానుష విగ్రహుడు శ్రీకృష్ణ భగవానుడు...
అన్ని వికారాలు తొలగించి తనయందలి భక్తికి యోగ్యత అందిస్తాడు...
తాను మ్రోగించిన మురళి మన శరీరమే...
దానికి, ఉన్న రంధ్రాలు మన శరీరానికి గల రంద్రాలే...
కన్నయ్యను తలచుకుంటూ చేసే పనులు కృష్ణునికి దగ్గరకు చేరుస్తాయి...
మనం పలికే స్వరంలో కృష్ణ నామం కృష్ణభక్తి కృష్ణప్రేమ మాధుర్యం హృదయంలో పొంగిపోవాలి.

హరే కృష్ణ

Thursday, July 6, 2023

శివోహం

నీ పాదాలు శరణం...
నీ తలపే మధురం...
నీ స్మరణయే జీవనంగా బ్రతికే భావ సంపద.ను కరుణించు చాలు
ధన్యోస్మి వేణు మణికంఠ...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

Wednesday, July 5, 2023

శివోహం

తప్పులు చేస్తూ ఉంటాం నిత్యం అందరం అది మానవ నైజం కానీ వాటిని ఒప్పుకుంటూ, "శివ" కరుణించి క్షమించు అని దైవం ముందు నిలబడి మొక్కడం మానవత్వం. 

ఓం నమః శివాయ

శివోహం

ఆశగా వున్నాది శివా నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కనులార నినుచూసి ఈ జన్మ తరియించి పోవాలని...

కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...