Monday, July 24, 2023

శివోహం

శివా!వెన్నులో ఏదో వేడి పుట్టింది 
ఆ వేడి ఎగబ్రాకి వెలుగులో కలసింది
ఆ వెలుగు నీవని తెలిసింది
మహేశా . . . . . శరణు

Sunday, July 23, 2023

శివోహం

సత్యం శివం సుందరం...
సత్యం శాశ్వతం...
శివం జ్ఞానం...
సుందరం శాశ్వత అనందం...
ఇవి పరమేశ్వర తత్వ రహస్యాలు జ్ఞాన బండారాలు...
అతని నిరాడంబర జీవిత విధానమే ఆ సచ్చిదానందం...
నిర్గుణ నిరాకార శివలింగ రూపమే మానవాళికి అందించిన అద్భుతమైన జ్ఞానో పదేశం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!మాడు మూసి మాయ చేసి
మమ్ము మోహంలో ముంచేసి
తెలియనీయవేమయ్యా తేట తెలివి.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
మనిషికి జంతువుకు తేడా కేవలం నీవు ప్రసాదించిన ఈ జ్ఞానమే కదా తండ్రి...
మాటల ద్వారా చేతల ద్వారా ప్రకటించి భావించి నిన్ను తెలుసుకునే అవకాశం లభించింది  కూడా నీ కృపతో నే కదా పరమేశ్వర...
దీనితోనే సకల ప్రాణికోటి లో ఉత్కృష్టమైనది మానవ జన్మ  ఉత్తమమైనది అనిపించు కుంటున్నాము...
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

Saturday, July 22, 2023

శివోహం

శివ...
కనులు మూసుకుని
మనసు తెరుచుకుని
రోదించే కనుల నీరు
కనురెప్పలెత్తి చూడలేను
అలా అని వేలుతో తుడవలేను
నేను కార్చే చివరి కన్నీరు ఐనా
నీ అభిషేకానికి అందేనా పరమేశ్వరా
మహాదేవా శంభో శరణు.

హరి

నారాయణా
విశ్వంభర
విశ్వేశా
విశ్వనాథ ప్రభో శరణు
శ్రీకృష్ణా శరణు...
దీన జన బాందవా శరణు...
స్వామీ శరణు.
ఓం నమో నారాయణాయ...

శివోహం

ఇంటిగుట్టు ఆవలి గట్టుకు చేర్చే పరాయోళ్లుంటారు మూసుకుని చూసుకుని మాటాడడం నేర్చుకో.
కనీసం శబ్దం లేని భాష నేర్చుకో

ఓం నమః శివాయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...