Thursday, July 27, 2023

శివోహం

శివా!నీ స్మరణే రక్షణ సూత్రం
ఆచరణే అందుకు నిదర్శనం
సఫలం కానీ సుపధం నెరిగి
మహేశా . . . . . శరణు .

Wednesday, July 26, 2023

శివోహం

భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు. బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల. ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపే. మరేదో పట్టిలాగేసుకుంటాడు . బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు. మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి. అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది. ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది - స్వామి జ్ఞానదానంద 

శివోహం

అణువు అణువున వెలసిన నీవు మాకు అగుపించేది ప్రకృతిలో...
ఆ ప్రకృతి పరవశములోనే మాకు వినిపించేది నీ ప్రణవనాదమే...
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది...
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! చేరువలోనే వున్నావు
చెవులకు వినిపిస్తున్నావు
చూపుకేలనో చిక్కకున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

అణువు అణువున వెలసిన నీవు మాకు అగుపించేది ప్రకృతిలో...
ఆ ప్రకృతి పరవశములోనే మాకు వినిపించేది నీ ప్రణవనాదమే...
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది...
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఈ విశ్వానికి సృష్టికర్త ఆ భగవంతుడు. సృష్టి మొత్తం ఆ భగవంతుడిదే. అన్నీ ఆయనవే. ఆయనవి కానివి ఈ లోకంలో ఏమీలేవు. చివరికి మనం కూడా ఈ సృష్టిలోని భాగమే. అందుకే యమునాచార్యులు తమ స్తోత్ర రత్నంలో ఇలా పేర్కొన్నారు. ‘స్వామీ! ఇన్నాళ్లూ ఇదినాది అని అనుకున్నదేదీ నాదికాదని తెలిసిపోయింది. చివరకు నేను అనుకునే నేను కూడా నీకు చెందిన మనిషినే. అన్నీ నీవేనని తెలిసింది. నాదంటూ ఏదీ లేనప్పుడు... అసలు నేనే నాకు కానప్పుడు నీకు నేను ఏమివ్వగలను?’ ఇలా శరణాగతి లక్షణంతో భక్తితత్వాన్ని ప్రకటించిన మనిషి నిరహంకారుడై ఉంటాడు. అప్పుడే నేను గొప్ప, నేను తక్కువ అనే భేదభావం ఆ మనిషిలో ఉండదు. అతడు మానవసేవ చేస్తూ సకల ప్రాణుల్లోనూ సర్వేశ్వరుణ్ని చూస్తాడు.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు మాకు అగుపించేది ప్రకృతిలో...
ఆ ప్రకృతి పరవశములోనే మాకు వినిపించేది నీ ప్రణవనాదమే...
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది...
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహాదేవా శంభో శరణు.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల