Sunday, July 30, 2023

శివోహం

జీవితంలో ప్రాప్తించిన వాటితో తృప్తి పడటం నేర్చుకున్న వ్యక్తి ఎన్నడూ విచారానికి గురికాడు...
ఏది చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురి అవుతూనే ఉంటాడు...

ఓం నమః శివాయ.

Saturday, July 29, 2023

శివోహం

ఓంకారం
శ్రీకారం
మకారం
త్రికారం
ప్రకారం
శుభంకరం
శంకరం
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ప్రతి కదలిక ఈశ్వరుడిదే...
జరిగేది జరుగుతుంది...
జరగనిది జరుగదు...
ఇది సత్యం
కనుక మౌనంగా ఉండడం ఉత్తమం...

రమణమహర్షి

శివోహం

శివా!అక్షుల కందని నిటలాక్షా
అక్షయ మైనది నీ రక్ష
విలక్షణ మైనది నీ శిక్ష
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!అక్షుల కందని నిటలాక్షా
అక్షయ మైనది నీ రక్ష
విలక్షణ మైనది నీ శిక్ష
మహేశా . . . . . శరణు .

Friday, July 28, 2023

శివోహం

శివా!నా వదనమున వెలుగులు విరిసె
నీ పదమున నే పదములు పలుక
నీ సధనమే మా గమ్యం ఈ ఎఱుకను పెంచు
మహేశా . . . . . శరణు

Thursday, July 27, 2023

శివోహం

శివా!నీ స్మరణే రక్షణ సూత్రం
ఆచరణే అందుకు నిదర్శనం
సఫలం కానీ సుపధం నెరిగి
మహేశా . . . . . శరణు .

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల