Sunday, July 30, 2023

శివోహం

శివా!కాలాన్ని కంఠాన చుట్టేవు
కాల కూటాన్ని కంఠాన పట్టేవు
నీ పాదాన్ని నే చుట్టేట్టు దృష్టి పెట్టు.
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎద్దు వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎట్టాగ తిరిగావు ఎట్టాగ కుదిరేను...
ఏమేమి చూసావో...
నీవు ఏమేమి చేసావో
ఏడ చూసిన నీవే
ఏమి చేసిన నీవే
ఎట్టాగ కుదిరేను నీకు మాకు ఎరుక కాకున్నాది...
ఎరుక పరచవయ్య...

మహాదేవా శంభో శరణు.

శివోహం

జీవితంలో ప్రాప్తించిన వాటితో తృప్తి పడటం నేర్చుకున్న వ్యక్తి ఎన్నడూ విచారానికి గురికాడు...
ఏది చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురి అవుతూనే ఉంటాడు...

ఓం నమః శివాయ.

Saturday, July 29, 2023

శివోహం

ఓంకారం
శ్రీకారం
మకారం
త్రికారం
ప్రకారం
శుభంకరం
శంకరం
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ప్రతి కదలిక ఈశ్వరుడిదే...
జరిగేది జరుగుతుంది...
జరగనిది జరుగదు...
ఇది సత్యం
కనుక మౌనంగా ఉండడం ఉత్తమం...

రమణమహర్షి

శివోహం

శివా!అక్షుల కందని నిటలాక్షా
అక్షయ మైనది నీ రక్ష
విలక్షణ మైనది నీ శిక్ష
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!అక్షుల కందని నిటలాక్షా
అక్షయ మైనది నీ రక్ష
విలక్షణ మైనది నీ శిక్ష
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...