Tuesday, August 1, 2023

శివోహం

అయ్యప్ప నామస్మరణం సకల పాపహరణం...
అయ్యప్ప దర్శనం జన్మజన్మల పుణ్యఫలం...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

మానవుడు చేసిన బొమ్మలు కావవి
మరువకుండా నిన్ను చూసుకునే స్వరూపాలు
మూసగా రూపాలన్నీ ఒకే స్వరూపం కలిగినా
మరి నీవు చేసిన మానవ రూపాలలో
బేధమెలా సాధ్యమయ్యేను మల్లికార్జునా
ఇంత ఆలోచనగా మమ్మల్ని సృష్టించిన
మిమ్మల్ని ఎందుకు మరచిపోతున్నాము.
నీమాయను తెలుసుకునేదెలా...
మహాదేవా శంభో సరనుం

Monday, July 31, 2023

శివోహం

అదిపూజ్య
విఘ్న నాయకా పూజలందుకో 
సమస్త ప్రజలను ఆదుకో 
సమస్త విజ్ఞానము పంచి మము ఏలుకో
ఓం గం గణపతియే నమః.

శివోహం

శివా!నీ ముంగిట నిలిచే నంది
నీ వెనుక వచ్చుట ఏమిటి
నందికైనా చెప్పని ఈ పయనమేమిటి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివుడు లేని చోటు ఎక్కడ?...
సకల సృష్టి, సమస్త చరాచరం అంతయూ ఆ సర్వాంతర్యామియే....
సర్వులయందు, సమస్తము నందు సర్వవ్యాపకుడు.
అంతయూ శివ స్వరూపమే......
ఇక నా శివుడు లేనిది ఎక్కడ?

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, July 30, 2023

శివోహం

శివా!కాలాన్ని కంఠాన చుట్టేవు
కాల కూటాన్ని కంఠాన పట్టేవు
నీ పాదాన్ని నే చుట్టేట్టు దృష్టి పెట్టు.
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎద్దు వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎట్టాగ తిరిగావు ఎట్టాగ కుదిరేను...
ఏమేమి చూసావో...
నీవు ఏమేమి చేసావో
ఏడ చూసిన నీవే
ఏమి చేసిన నీవే
ఎట్టాగ కుదిరేను నీకు మాకు ఎరుక కాకున్నాది...
ఎరుక పరచవయ్య...

మహాదేవా శంభో శరణు.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల