Thursday, August 3, 2023

శివోహం

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము...
అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..
గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి...
కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..
ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు బద్ధకానికి కాదు..
గుర్తుంచుకో మిత్రమా
నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి మనకు సహనం ఉండాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఆకారానికి అందని నీవు ఓం కారాన ఒదిగేవు సృష్టికి శ్రీ కారం నీవు పంచాక్షరిలో ప్రభవించేవు
సకల జీవుల శోభించేవు ఆది దేవునిగ తెలిసేవు
మహేశా . . . . . శరణు .

Wednesday, August 2, 2023

శివోహం

నా నింగిలో నీడ నువ్వే...
నను నిలిపి ఉంచే నేల నువ్వే...
నను తడిపే వాన నువ్వే...
ముంచెత్తే వరద నువ్వే...
చీకటి నువ్వే.. 
వేకువ నువ్వే.. 
సంద్రం నువ్వే.. 
తీరం నువ్వే.. 
ప్రకృతి నువ్వే.. 
ప్రళయం నువ్వే...
ఆశ నువ్వే...
తుది శ్వాస నువ్వే హరా...
బతుకాట ఇక చాలు రా...
నీ పిలుపు కోసం కడపటి వాకిట కాచుక్కూచున్నా...
నీ నుంచే విడివడిన నే నీలోకే ప్రవహించేస్తున్నా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నన్ను నేనే మరచి...
నీధ్యానంలో మునిగితే...
పిచ్చివాడినంటున్నది లోకం...
నిన్నే తలచి నిన్ను చెరుటకై...
నీ వెంటపడుతుంటే...
వెర్రివాడంటోంది లోకం...
నిజమే నేను వెర్రి వాడిని నిలగా తిక్కవాడిని...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!జ్ఞానం పూవులాగ వికసించనీ
వైరాగ్యం వెయ్యేళ్ళు వర్ధిల్లనీ
హృదయాన విష్ణువుతో జతకట్టనీ
మహేశా . . . . . శరణు.

Tuesday, August 1, 2023

శివోహం

నాన్నా
ఎన్ని జన్మలైందో 
కనులారా నిను చూసి
తనివితీరా ఆలింగనించుకొని
ఆర్తితో ఆరాధించి
కన్నీటితో పదములు కడిగి

అంతులేని ఆవేదనా తరంగాలలో
మునిగిపోతున్న నన్ను నీ ఒడికి చేర్చు
ఓపలేని కష్టాల వరదలో
 కొట్టుపోతున్న నన్ను అక్కున చేర్చు
తొలగించుకోలేని మయ పొరలలో
సంచరిస్తున్న నన్ను దయతో అదరించు
విడిపించుకోలేని బాంధాల వలలలో
చిక్కుకున్న నన్ను వాత్సల్యాన స్వీకరించు

ఒకపరి రావయ్యా
ఈ కింకరుని అనుగ్రహించవయ్యా

శివయ్యా నీవే దిక్కయ్యా

శివోహం

నేను .నా అహం శిఖరాల పై  నిలుచున్నప్పుడు 
నీ త్రిశూలం కొనకు పని చెప్తావు 
నా తేలిపోయే కీర్తి ప్రతిష్టల మాటున 
నిను మరిచినప్పుడు నీ ఢమరుకం మ్రోగిస్తావు  
అందుకే ఓ భోలే నాధ్ నీ ముందు బోల్తా పడ్డాను

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...