Tuesday, August 29, 2023

శివోహం

ఓం నమః శివాయ
రుద్రాయ‌
వాసుదేవాయ
శంభవే
శరణ్యాయ
అగ్రగణ్యాయ
త్ర్యబంకాయ
నీలకంఠాయ తే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

ఓం పరమాత్మనే నమః.

శివోహం

పుట్టేటప్పుడు తొమ్మిది నెలల ముందు నుంచే వస్తున్నామని చెవుతారు....
పోయేటప్పుడు ఒక్క సేకను కూడా చెప్పారు కదా ఈ మనసులు.

శివ

శివయ్యా

ఇంకనూ మిగిలిన

స్వాసల భస్మం
నీకోసమే

చూపుల చందనం
నీ కోసమే

ప్రాణ దీపం
నీ కోసమే

నాకంటూ ఏమీ
మిగల్చకు
నా అన్న భావనే
రానీయకు

ఇంకా ఎంత కాలం
నా అనుకుంటూ
నీకు దూరంగా ఉంటాను?

నా అంటూ ఏదన్న ఉంటే
అది నీవే అని
తెలిసే జ్ఞానాన్ని
ప్రసాదించు

శివయ్యా నీవే దిక్కయ్యా

గోవిందా

స్వామీ

నాకోసమే
కనిపిస్తున్న
పాదాలను
కన్నీటితో
కడగక
మాయలో
మమకారంలో
చిక్కుకున్న
నా అజ్ఞానాన్ని
కూడా తొలగించు

శివోహం

నిఖిల లోకము లందు...
లక్షలమంది భక్తులకు ఆశ్రయం అభయం ఆనందం తో బాటు మళ్ళీ దర్శించుకోవాలన్న అనుభూతినీ అనుగ్రహించిన ఆ దేవదేవుని దయకి-
ప్రణామాలు సమర్పించడం తప్ప ప్రతిగా మనం ఏమి చేయగలం.

ఓం నమో వెంకటేశయా.

Sunday, August 27, 2023

శివోహం

శివా!వంక జాబిలి వంక వెలుగులీనుతూ
చుక్కలన్నీ కూడి చూడవచ్చె
నీ కొప్పులోన కొంత చూసి అచ్చెర్వొందే
మహేశా . . . . . శరణు .

శివోహం

మాట మౌనం...
ఈ రెండు మానవునికి ముఖ్యమైనవే...
ఈ రెండూ మనిషిని ఉన్నతంగా నిలిపేవే...
అయితే అవి రెండూ అర్ధవంతంగా ఉండాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.
జై శ్రీమన్నారాయణ.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల