Thursday, September 28, 2023

శివోహం

ఋణాను బంధ రూపేణా:
బంధాలు కొన్ని ఋణాలు తీరగానే బంధ విముక్తి అవుతాయి. వారి నుండి దూరం పెరుగుతుంది.కొన్ని రుణాలు జన్మ జన్మల నుండి వస్తూ ఉంటాయి. అవే తల్లిదండ్రుల ఋణం, ఋషుల రుణం,దేవతా ఋణం.. ఇవి ఎప్పుడూ వెంటే ఉంటాయి.

మంచితనం, మానవత్వం, దయ ,పాప భీతి, భక్తి,భయం తో జీవితాన్ని ఆ దేవదేవుని పాదాల శరణు వెడితే జీవితం లో శాంతి ఆనందం లభిస్తుంది.

శివోహం

నమ్మకం బలంగా ఉన్నచోట
దీవెనలు దండిగా ఉంటాయి...
నమ్మి కోలువవే మనసా...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!గణపతి ధళపతులు నీ ఇంటి సుతులే
నీ నాభి బంధము లేకే నడయాడ వచ్చారు
నేను కూడా అంతేగా ,మరి వింత ఏమున్నది
మహేశా . . . . . శరణు .

Wednesday, September 27, 2023

శివోహం

శివా!గంగ కొసగేవు కమ్మదనం
చంద్రుని కొసగేవు చల్లదనం
నాకీయవయ్యా జ్ఞాన ధనం
మహేశా. . . . .శరణు

శివోహం

ఆనందాన్ని కలిగించి...
దుఃఖాన్ని తొలగించే...
బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే మంగళ మూర్తి గణపయ్య వెళ్ళిరావయ్య.
గణేశా శరణు.

శివోహం

ఎవరికి చెప్పుకోలేని మానసిక సంఘర్షణ...
బాధ , కోపం వచ్చినప్పుడు...
నాతో నేను మాట్లాడుకుంటా...
నాలో ఉన్న నీతో మాట్లాడుతున్నట్టె కదా తండ్రి.
మహాదేవా శంభో శరణు.

ఓం పరమాత్మనే నమః.

Tuesday, September 26, 2023

శివా ! హాల హలం 
ఆనందంగా మ్రింగేసావు 
పరమ సత్యం నీ కంఠం లో 
నీలంగా దాచేశావు శివా ! నీ దయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...